వినోదం

ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో తరుణ్ మరియు ఉదయ్ కిరణ్ స్టార్ హీరోలుగా కొనసాగారు. ప్రేమ కథా చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకున్న వీరు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. 2000 సంవత్సరంలో ఇద్దరు ప్రేమ కథా చిత్రాల తోనే మంచి పేరు సంపాదించుకున్నారు. నువ్వే కావాలి మూవీ తో తరుణ్ హీరో గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. మరోపక్క అదే ఏడాది చిత్రం మూవీ తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరో అయిపోయారు ఉదయ్ కిరణ్. తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు కూడా చేసి వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాడు.

ఇవి ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా చేశాయి. ఇలా ఉదయ్ కిరణ్ మరియు తరుణ్ ఇద్దరి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వీరితో ఒక మల్టీ స్టారర్ మూవీ ని చేయాలని భావించాడు ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఆయన ఎవరంటే ఎమ్.ఎస్.రాజు. ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే మూవీని చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న రాజు, ఉదయ్ కిరణ్ తో నీ స్నేహం సినిమా కూడా చేశారు. అయితే మనసంతా నువ్వే సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో నీ స్నేహం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2002 నవంబర్ 1న నీ స్నేహం మూవీ థియేటర్ లోకి వచ్చింది. సినిమా మొదటి రోజు మంచి ఫలితాలు వచ్చాయి కానీ, పోనుపోను ఆశించిన ఫలితాలు సాధించలేదు.

tarun said no to uday kiran multi starrer movie

దీనికి కారణం ఏంటో ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు చెప్పారు. నీ స్నేహం సినిమాలో ముందుగా స్నేహితుడి పాత్రకి తరుణ్ అనుకున్నారట. కొన్ని అనివార్య కారణాలవల్ల అతను నో చెప్పడంతో ఎవరికీ పరిచయం లేని జతిన్ గ్రేవాల్ తో ఈ పాత్రని చేయించారట, దీంతో ఈ సినిమా అటు లవ్ స్టోరీ, అలాగే బెస్ట్ ఫ్రెండ్ షిప్ రెండిట్లో ఏది కాకుండా పోయిందని ఎమ్మెస్ రాజు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఒకవేళ తరుణ్ కనుక ఇందులో చేసి ఉంటే నీ స్నేహం సూపర్ హిట్ అయ్యేదని ఆయన తెలియజేశారు.

Admin

Recent Posts