ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్ అవుతుందని భావిస్తారు.. మరి అలాంటి టైమ్‌లో ఆ సినిమా థియేటర్ లోకి రాక ముందే పైరసీ బారిన పడితే పరిస్థితి ఏంటి.. అలాంటి సమస్యలు ఏయే సినిమాలకు ఎదురయ్యాయో ఓ సారి చూద్దాం..
ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఎన్నో లాభాలు వస్తాయని ఆశ పెట్టుకున్న సినిమా నష్టాల బారిన పడుతుంది.. దీనికి ప్రధాన కారణం కొంతమంది టెక్నాలజీ ఉపయోగించి అందులో డేటా ను పైరసీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతోంది.. ఏ విధంగా అంటే మూవీ ఎడిటింగ్ లో ఉన్న టైంలో కొందరు చిత్ర యూనిట్ లోని సభ్యులు సరదా కోసం ఎవరికి తెలియకుండా ఆ యొక్క మూవీస్ ను రికార్డు చేసి మరీ బయటకు షేర్ చేస్తూ ఉంటారు.. దీంతో అది ఒకరి దగ్గర ఆగకుండా చివరికి వెబ్ సైట్ లో పెట్టే వరకు రావడం జరిగింది.. ఈ విధంగా పైరసీ బారినపడి రిలీజ్ కాకుండానే లీక్ అయిన సినిమాలు ఓసారి చూద్దాం..
గీతా గోవిందం: విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతగోవిందం సినిమా కూడా విడుదలకు ముందే పైరసీ బారిన పడింది. ఏకంగా ఈ మూవీ రషెస్ కాపీనే ఆన్ లైన్‌లో పెట్టారు. అయినా ఈ మూవీ విజయాన్ని ఆపలేకపోయారు. అలాగే జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి కూడా పైరసీ బారిన పడింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది మూవీ కూడా పైరసీ బారిన పడింది.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా కూడా పైరసీ బారిన పడింది. చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ కూడా పైరసీ బారిన పడింది. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2 మూవీని కూడా విడుదలకు ముందే పైరసీ చేశారు. ఎన్‌టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ మూవీ, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా మూవీ, రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి మూవీ కూడా విడుదలకు ముందే భారీ ఎత్తున పైరసీ బారిన పడ్డాయి. అయితే ఈ మూవీల్లో కొన్ని ఫ్లాప్ అవగా కొన్ని మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.