తమిళ్ లో పెద్ద హిట్స్ తెచ్చుకుని అక్కడ హిట్స్ ఉన్న దర్శకులు తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసారు. కె. బాలచందర్, భారతి రాజా మణిరత్నం ల నుండి ఒక్కసారి వచ్చిన లింగుసామి వరకు కొందరు టాలీవుడ్‌లో డైరెక్ట్ తెలుగు సినిమాలతో తమ అదృష్టం కోసం ప్రయత్నించారు. ఇలా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి డెబ్యూ ఇచ్చి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసి హిట్స్, ఫ్లాప్‌లు తెచ్చుకున్న డైరెక్టర్స్ లిస్ట్ పెద్దదే ఉంది. కానీ కొంత మంది మాత్రమే హిట్స్ ఎక్కువ ఇచ్చారు, కొంత మంది ఫ్లాప్. అయితే ఈ లిస్ట్‌లో మరీ దారుణంగా ఫ్లాప్ అయిన తమిళ దర్శకుల డైరెక్ట్ తెలుగు సినిమాలు, ఆ సినిమాలు ఏంటి అనేది ఓసారి చూసేద్దాం. #1 SJ సూర్య – కొమరం పులి.. కుషీతో హాట్ కొట్టిన Sj సూర్య-PK కాంబో సెకండ్ టైమ్ రిపీట్ చేస్తే కొమరం పులి రూపం లో పెద్ద ఫ్లాప్ వచ్చింది.
#2 ఎ.ఆర్. మురుగదాస్ – స్పైడర్.. ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన మురుగదాస్ & మహేష్ బాబు ల స్పైడర్ అయితే డిజాస్టర్ అయ్యింది. #3 ధరణి – బంగారం.. పవన్ కళ్యాణ్ తో పని చేసిన మరో తమిళ దర్శకుడు ధరణి – బంగారం రూపం లో మరో ఫ్లాప్ ఇచ్చాడు. #4 విష్ణువర్ధన్ – పంజా.. పంజా సినిమాతో ముచ్చటగా మూడోసారి ఒక తమిళ దర్శకుడుతో పని చేసిన పీకే కి మరో ఫ్లాప్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ మంచి ఫిల్మ్ మేకర్ కానీ ఎందుకో ఈ హైప్ వల్ల యావరేజ్ గా ఉన్నా ఫ్లాప్ అయ్యింది.
#5 ఎన్. లింగుస్వామి – వారియర్.. ఇక ఇటీవలి కాలంలో రామ్ పోతినేని తో కలిసి పని చేసారు పందెం కోడి ఫేమ్ దర్శకుడు లింగుసామి. ఎన్నో ఆశలు పెట్టుకున్న లింగుస్వామి కి ఈ సినిమా ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ విశ్లేషకులు డిజాస్టర్ అన్నారు.