వినోదం

Vetagadu Movie : వేట‌గాడు సినిమా చేసేందుకు శ్రీ‌దేవి మొద‌ట ఒప్పుకోలేద‌ట‌.. త‌రువాత ఏమైందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vetagadu Movie &colon; నటన మీద మక్కువతో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొని&comma; కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా&comma; అభిమానుల దేవుడిగా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నటసార్వభౌమ నందమూరి తారక రామారావు&period; పౌరాణిక&comma; జానపద&comma; సాంఘికం ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ఒక సపరేట్ ట్రెండ్ ని సెట్ చేసారు&period; వరుస విజయాలతో ప్రతీ ఏటా దాదాపు పదుల సినిమాలు విడుదల చేస్తూ బిజీగా గడిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటిలో ఎన్టీఆర్ తో సినిమాలలో కలిసి నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు తాపత్రయపడేవారు&period; ఎన్టీఆర్ తో నటించడానికి ఒక్క అవకాశం వస్తే చాలని అనుకునేవారు&period; 1970 తర్వాత ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగిపోయింది&period; ఆయన సినిమాలను చూడటానికి జనాలు ఎలాంటి వాహన సౌకర్యం లేని రోజులలో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళే వాళ్ళు&period; ఇక ఆ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక కథ సిద్ధం చేసుకున్నారు&period; ఆ సినిమానే వేటగాడు&period; ఈ సినిమా సాధించిన విజయం ఇప్పటికి కూడా ఒక సంచలనం అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59067" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;vetagadu-movie&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వేటగాడు సినిమాకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి&period; కానీ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజుల వరకూ ఒక స్పష్టత రావడం లేదట&period; రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట తప్ప మరో మాట మాట్లాడటం లేదట&period; వేటగాడు సినిమా నిర్మాత అర్జున రాజు మాత్రం ఆమెను వద్దంటే వద్దని కచ్చితంగా చెప్పేశారట&period; ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి మరీ చిన్న పిల్లలా ఉంటుందని వద్దన్నారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డారు&period; శ్రీదేవి కూడా ఎన్టీఆర్ పక్కన చేయడానికి ఇష్టం చూపించలేదు&period; ఈ విషయం ఆ నోటా ఈ నోటా అనుకోవడం చివరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది&period; నిర్మాతలను పిలిచి మాట్లాడిన ఎన్టీఆర్ అసలు విషయం అడిగితే&period;&period; 5 ఏళ్ళ క్రితం మీ పక్కన బడిపంతులు చిత్రంలో మనవరాలిగా నటించింది&period;&period; ఇప్పుడు ఆమెను హీరోయిన్ అంటే జనాలు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండరు&period; ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించి సినిమాల్లో నటించే వారికి సెంటిమెంట్ లు చూడకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేక్షకులు దేవుళ్ళుతో సమానం&period; వాళ్ళు అన్నీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు&period; మీకు ఎందుకు బాధ&comma; నాదీ బాధ్యత&period; అంతేకాకుండా మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతా అని హామీ కూడా ఇచ్చారట&period; సినిమా కథాంశం బలంగా ఉండాలి గాని ఇవన్నీ ఎందుకు అన్నారట&period; శ్రీదేవిని కూడా ఆయనే స్వయంగా ఒప్పించటం జరిగింది&period; ఫైనల్ గా వేటగాడు సినిమా తెరపైకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; ఈ సినిమాతో ఎన్టీఆర్&comma; శ్రీదేవి జోడి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు&period; ఆ సినిమా హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts