వినోదం

Lissy : అప్ప‌ట్లో ఈమె తెలుగులో టాప్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Lissy : సినిమా ఇండ‌స్ట్రీలో కొంద‌రు మాత్రం దీర్ఘ‌కాలం పాటు హీరోయిన్స్‌గా కొన‌సాగుతారు. కానీ కొంద‌రు ఒక‌టి రెండు సినిమాల్లో న‌టించి ఆ త‌రువాత ఇండ‌స్ట్రీకి దూర‌మ‌వుతారు. అయితే ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఇలా ఒక‌టి రెండు సినిమాల్లో న‌టించి ఇండ‌స్ట్రీకి దూర‌మైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో లిజి ఒక‌రు. ఈమె చేసింది త‌క్కువ సినిమాలే అయినా ప్రేక్ష‌కుల‌కు ఈమె గుర్తుండే ఉంటుంది. అప్ప‌ట్లో ఈమె తెలుగులో కేవ‌లం 8 సినిమాల‌ను మాత్ర‌మే చేసింది. త‌రువాత ఆమె ఇండ‌స్ట్రీకి దూర‌మైంది.

లిజి చేసిన సినిమాల్లో రెండు మూడు మాత్ర‌మే హిట్ అయ్యాయి. ఈమె 2 ఏళ్ల పాటు అప్ప‌ట్లో తెలుగు తెర‌పై మెరిసింది. త‌రువాత సినిమాల‌కు దూర‌మైంది. కేరళలో పుట్టి పెరిగిన లిజి చిన్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో తల్లి దగ్గరే పెరిగి పెద్దదైంది. 16 ఏళ్ల వయస్సులో ఇంటర్ చదువుతుండగా మళ‌యాళ మూవీలో చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏడాదికి 20సినిమాలు చేసే స్థాయికి ఎదిగి విపరీతంగా పాపులార్టీ సంపాదించింది. రాజేంద్ర ప్రసాద్ తో సాక్షి మూవీలో నటించి టాలీవుడ్ కి 1989లో ఎంట్రీ ఇచ్చింది. 1991వరకూ మాత్రమే లిజి ఇక్కడ పనిచేసింది.

veteran actress lissy photos viral

సుమన్ హీరోగా వచ్చిన 20వ శతాబ్దం, దోషి నిర్దోషి, ఆత్మబంధం అనే మూవీస్ లో లిజి హీరోయిన్ గా చేసింది. భానుచందర్ తో స్టూవర్టుపురం దొంగలు, రాజశేఖర్ నటించిన మగాడు మూవీ తో పాటు మామశ్రీ లో కూడా లిజి నటించింది. 1990లో డైరెక్టర్ ప్రియదర్శన్ ప్రేమలో పడిన ఈమె మొత్తానికి పెళ్లిచేసుకుంది. అప్పటికే ఒప్పుకున్న‌ సినిమాలు పూర్తిచేసి ఫ్యామిలీకి అంకితం అయ్యింది. తెలుగులో తక్కువ చేసినా మ‌ళ‌యంలో 100 సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఇక ఈమె అప్పుడ‌ప్పుడు బ‌య‌ట క‌నిపిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఈమె లేటెస్ట్ ఫొటోలు అప్పుడ‌ప్పుడు వైర‌ల్ అవుతుంటాయి.

Admin

Recent Posts