వినోదం

ఒక‌ప్ప‌టి మూవీల్లో ప‌ర‌మ చెత్త మూవీలుగా అనిపించుకున్న‌వి ఏమిటో తెలుసా..?

ఏ జ‌న‌రేష‌న్‌లో అయినా స‌రే కొన్ని మూవీలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలుస్తాయి. ప్ర‌జ‌లు అలాంటి మూవీల‌ను ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. ఇక ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచిన మూవీలు కూడా ఉంటాయి. ఇవి కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు హీరోలుగా ఉన్న స‌మ‌యంలో విడుద‌లైన ప‌ర‌మ చెత్త సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుకుందాం. ఎన్‌టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన సూప‌ర్ మ్యాన్ సినిమా గుర్తుండే ఉంటుంది.

ఎన్‌టీఆర్ అనేక పాత్ర‌లు చేయ‌డంలో దిట్ట‌. కానీ సూప‌ర్ మ్యాన్ గెట‌ప్ మాత్రం ఆయ‌న‌కు సూట్ అవ‌లేదు. అస‌లు ఆయ‌న ఈ సినిమా ఎందుకు తీశారో కూడా చాలా మందికి అర్థం కాలేదు. త‌న వ‌య‌స్సుకు త‌గిన పాత్ర కూడా కాదు. సూప‌ర్ మ్యాన్ పాత్ర‌కు చక్క‌ని ఫిజిక్ ఉండాలి. అది ఆయ‌న‌కు లేదు. అయినా ఈ మూవీని చేసి సాహ‌సం చేశార‌నే చెప్పాలి. అప్ప‌ట్లో ఇది అత్యంత చెత్త సినిమాగా నిలిచింది. అలాగే ఏఎన్నార్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ‌చిన ధ‌ర్మదాత మూవీ కూడా. ఈ మూవీ వాస్త‌వానికి బాగానే ఉంటుంది. కానీ వృద్ధుడి పాత్ర‌లో ఓవ‌ర్ యాక్ష‌న్ ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పిస్తుంది.

what are some disaster movies then

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన కిలాడి కృష్ణుడు అనే మూవీ కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. సినిమా ప‌ర‌మ బోరింగ్‌గా ఉంటుంది. అదేవిధంగా చిరంజీవి సుప్రీమ్ హీరో కూడా కాక‌ముందే చేసిన సినిమా.. ఇది పెళ్లంటారా.. ఇది కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Admin

Recent Posts