Kalyan Chakravarthi : నందమూరి ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా ఇండస్ట్రీలోకి చాలా మంది వచ్చారు. అయితే అందులో కొందరు మాత్రమే రాణించారు. ప్రస్తుతం బాలయ్య, ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారు. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్న ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కాగా, సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకున్న ఆయన కుమారులు బాలకృష్ణ స్టార్ హీరోగా క్రేజ్ ను సొంతం చేసుకుంటే.. హరికృష్ణ నటుడుగా తనదైన శైలిలో రాణించాడ. ఇక నందమూరి మూడో తరం వారసులుగా ఎన్టీఆర్ మనవళ్లు కళ్యాణ్ రామ్, చైతన్య కృష్ణ, తారక రత్న, ఎన్టీఆర్ లు వెండి తెరపై అడుగు పెట్టారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగారు. ఆయన తనయులు కళ్యాణ్ చక్రవర్తి, హరీన్ చక్రవర్తిలు కూడా సినీ పరిశ్రమలో నటులుగా అడుగు పెట్టారు. అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరీన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొడుకు మరణంతో కృంగిపోయిన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. చెన్నైలో స్థిరపడ్డాడు.
మంచి అందగాడైన కళ్యాణ్ చక్రవర్తి ‘అత్తగారు స్వాగతం’, ‘అక్షింతలు’, ‘అత్తగారు జిందాబాద్’, ‘ఇంటి దొంగ’, ‘మామ కోడళ్ల సవాల్’, ‘కృష్ణ లీల’, ‘రౌడీ బాబాయ్’ ,’దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’, ‘తలంబ్రాలు’, ‘ప్రేమ కిరీటం’, ‘జీవన గంగ’ వంటి సినిమాల్లో ఇతను నటించాడు.అయితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. చక్రవర్తి తమ్ముడు.. భార్యతో వచ్చిన గొడవల కారణంగా సూసైడ్ చేసుకోగా, కళ్యాణ్ మనస్థాపం చెంది కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ ఘటన నుంచి బయటకు రాకముందే చక్రవర్తి కొడుకు పృద్వి చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. గతంలో తారకరత్న అంత్యక్రియలలో కనిపించాడు కళ్యాణ్ చక్రవర్తి.