వినోదం

NTR: బాల‌కృష్ణ‌ని పిలిచి ఎన్టీఆర్ చెప్పిన 3 విష‌యాలు.. ష‌ర‌తులుగా పాటించాల‌ని సూచ‌న‌

NTR: నందమూరి నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయ‌న చేసిన కొన్ని సినిమాలు రికార్డుల‌ని తిర‌గ‌రాసాయి. ప్ర‌స్తుతం న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను అద‌ర‌గొడుతున్నాడు బాలయ్య‌. అయితే బాల‌య్య న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు చిత్రం కూడా ఒక‌టి. బాలయ్య,సుహాసిని జంటగా నటించిన ఈ సినిమాలో భానుమతి బామ్మగా చేసారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి తీసిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా హైదరాబాద్ లో ఎక్కువ థియేటర్స్ లో ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడింది.

ఆ ఒక్క చోటే 50 లక్షలు వసూలుచేసి, అందరిని ఆశ్చర్యపరిచింది. తమిళంలో భారతీరాజా పల్లె తీసిన మన్ వాసిని మూవీ నిర్మాత గోపాల్ రెడ్డిని బాగా ఆకట్టుకుంది. అప్పటికే మనిషికో చరిత్ర, అపరాధి, ముక్కుపుడక వంటి మూవీస్ నిర్మించిన అనుభవంతో తమిళ మూవీ రైట్స్ తీసుకున్నారు.అనంత‌రం కోడి రామకృష్ణను సంప్రదించి, డైరెక్ట్ చేయమని సూచించడంతో కొన్ని మార్పులు ఉండాలని చెప్పడం ,పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో గణేష్ పాత్రో తో కల్సి కథలో కీలక మార్పులు చేయించారు. అయితే ఈ సినిమాకి బాలయ్య ఒకే చేసినా తండ్రి ఎన్టీఆర్ ఒకే చేయలేదు. రెండు సార్లు చేసిన ప్రయత్నం విఫలమవడంతో జననీ జన్మ భూమిశ్చ షూటింగ్ లో ఉన్న బాలయ్యను సంప్రదించడంతో తండ్రిని ఒప్పించారు.

sr ntr told these 3 important things to balakrishna

సినిమా షూటింగ్ కు ముందు బాల‌కృష్ణ‌ను పిలిచి ఎన్టీఆర్ మూడు విష‌యాలు చెప్పారు. వీటిని ష‌ర‌తులుగా పాటించాల‌ని పేర్కొన్నారు. మొద‌టిది భానుమ‌తి కంటే అర‌గంట ముందే షూటింగ్ వ‌ద్ద‌కు వెళ్లి రెడీగా ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా నీ వ‌ల్ల ఆమె వెయిట్ చేయొద్దు అని. మ‌రొక‌టి ఆమె కార్ డోర్ నువ్వే తీయాలి, మూడోది ఆమె కార్లోంచి దిగ‌గానే ఆమె కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పార‌ట‌. దాంతో బాల‌య్య తండ్రికి ఇచ్చిన మాట ప్ర‌కారం షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు పాటించాడు. సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఆ మ‌ర్యాద సినిమా త‌ర్వాత కూడా కొన‌సాగింది. నాయన్నమ్మ పాత్రకు భానుమతి కూడా ఒకే చెప్పేయడంతో టైటిల్ ఆమె పేరు కల్సి వచ్చేలా మంగమ్మగారి మనవడు అని పెట్టారు.

Admin

Recent Posts