Actors Dresses : గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంట్ గుర్తుంది కదా. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ ఎంతమంది అలాంటి ప్యాంట్స్ వేసుకుని దర్శనం ఇచ్చారో. కేవలం అదొక్కటే కాదు. ఫ్యాషన్ అంటే తెలియని చాలామంది కుర్రాళ్లకి పవన్ అంటే క్రేజ్ ఏర్పడ్డానికి రీజన్ అదే. స్టైల్ లో కానీ, డ్రెస్సింగ్‌లో కానీ, లుక్ లో కానీ పవనే వారికి రోల్ మోడల్. అప్పట్లో వాణిశ్రీ హెయిర్ స్టైల్, చిన్న పైట అందరినీ ఆకట్టుకునేవి. అయితే హీరో హీరోయిన్ల బట్టలకు ఎంత ఖర్చు అవుతుంది, సినిమా షూటింగ్ అయిపోయాక ఆ బట్టలను ఏం చేస్తారో తెలుసా..?
ఒక మామూలు సినిమాలో హీరోగా నటిస్తేనే పది లక్షల వరకు ఖర్చవుతుందట. అలాంటిది ఒక స్టార్ హీరోకి ముప్పై నుండి నలభై లక్షలు కేవలం వారు వేసుకునే బట్టల మీదే ఖర్చు పెడతారట. హీరోలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫారిన్ డిజైనర్స్ ను కోరుకుంటారట. దీనికోసం అటు హీరోలతో, ఇటు డిజైనర్స్ తో ప్యాకేజ్ మాట్లాడుకుని మరీ డ్రెసెస్ డిజైన్ చేయిస్తారట నిర్మాతలు. హీరోలకు ఒకే మరి హీరోయిన్ల పరిస్థితి ఏంటి.
కాజల్ అగర్వాల్ కు ఒక సినిమాలో కాస్ట్యూమ్స్ కు అయిన ఖర్చు నలభై లక్షలు. ఇన్నిన్ని డబ్బులు పోసి కొన్నాక వాటిల్లో ఏదైనా నచ్చితే ఇంటికి తీసుకెళ్లిపోతారట హీరోయిన్లు. లేదంటే అక్కడే వదిలేస్తారట. వాటిని గోడౌన్స్ లో పడేస్తారట. మరికొందరు సెకండ్ హ్యాండ్‌లో అమ్ముతారు. యాభై లక్షల బట్టలను ఐదు లక్షలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయట. మరికొందరేమో తర్వాత సినిమాలకు సైడ్ క్యారెక్టర్స్ కి అవే బట్టలను వినియోగిస్తారట. బట్టల తరహాలోనే హీరోయిన్లు వాడిన నగలు, చెప్పులు మిగతా యాక్సెసరీస్ అన్నీ వేలంలో అమ్మేస్తారట. ముఖ్యంగా ముంభైలోని మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ వి ఎక్కువగా అమ్ముడు పోతాయట. ఇకపోతే సీరియల్ ఆర్టిస్టుల బట్టలు ఎవరివి వారే తెచ్చుకోవాలని డైరెక్టర్లు ముందుగానే చెప్పేస్తారు. అదండీ సినిమావారి బట్టల వెనుకున్న కథ.