వినోదం

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

మృగరాజు సినిమాలో నటించకుండా ఉండాల్సింది. ఈ సినిమాలో చివరి పది పదిహేను నిమిషాలు భ‌లే వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు 5 ఏళ్ల పిల్ల అయినా కొండలెక్కి సింహం దగ్గరికి వెళ్లడం . చిరంజీవి సింహం తినేయబోతు ఉండగా వచ్చి కాపాడడం. ఇదంతా భ‌లే హాస్యంగా ఉంటుంది. నిజజీవితంలో సింహం ముందుండగా అడ్డుగా మంచి గట్టి అద్దం లేకపోతే ఆ మనిషిని ఎవరూ కాపాడలేరు . సింహం చాలా వేగంగా పరిగెడుతుంది అంత వేగంగా మనిషి పరిగెత్త‌లేడు కాబట్టి సింహం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ ఈ సినిమాలో చిరంజీవి పరిగెత్త‌గలిగి సింహం నుంచి తప్పించుకున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి తప్పించుకోవడమే కాకుండా సింహాన్ని చంపేస్తాడు . ఎలా చంపాడో తెలుసా ఒక కత్తితో పొడిచి . సింహం 250 కేజీల కంటే ఎక్కువ బరువుంటుంది . అటువంటి సింహం మీద పడితే సగం ప్రాణం పోతుంది, అలాంటిది సింహం మీద పడ్డా చిరంజీవి బతికి ఉండటం, మళ్లీ అదే సింహాన్ని కత్తితో పొడవడం సినిమా ఇతిహాసంలోనే ఒక అసాధారణమైన సన్నివేశం. కత్తి పోటుకే సింహం వెంటనే చావదు, వరుసగా బులెట్ మీద బుల్లెట్ తుపాకీతో షూట్ చేస్తేనే వెంటనే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక పోటుకే వెంటనే చచ్చిపోతుంది. సింహం చావడం తర్వాత చిరంజీవి సింహాన్ని చేతితో తోసేస్తాడు, అదేదో చిన్న పిలిని తోసినట్లు, ఆ సింహం 250 కేజీల కంటే ఎక్కువ ఉంటుంది. ఎన్నో మనుషులు కష్టపడి తోస్తే గాని కొంచెం జరుగుతుంది. అది ఒక మనిషి తోసేయడం అన్నది అవాస్తవికమైన‌ ‌‌ విషయం.

which chiranjeevi movie is most irritating

ఈ సినిమా తీసిన దర్శకుడు కాస్త తెలివి వాడాల్సి ఉండేద‌ని అభిప్రాయం. కానీ అటువంటి దర్శకుడే ఒక్కడు వంటి ఇండస్ట్రీ హిట్ తీయడం ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటి అవాస్తవికమైన సన్నివేశాలు ఉన్న కథ ఒప్పుకోకుండా ఉండవలసినది. ఇదంతా నిజ జీవితంలో ఒక మనిషి చేసి ఉంటే అతనికి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు దొరికేది. చిరంజీవి చేసిన అన్ని సినిమాలలో నాకు తెలిసి ఇదే అత్యంత చెత్త సినిమా.

Admin

Recent Posts