సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు సంచలనం సృష్టించాయి. ఒకటి అల్లు అర్జున్ అరెస్టు, విడుదల. రెండోది మోహన్ బాబు టీవీ9 ప్రతినిధిని కొట్టడం. అయితే సారీ చెబుతూ మోహన్ బాబు లేఖను విడుదల చేశారు కానీ కేసు మాత్రం పెండింగ్ ఉంది. ఆయన పోలీసుల ఎదుట హాజరు కావల్సి ఉంది. ఇక మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే మంచు మనోజ్‌కు, తన సోదరుడు విష్ణుకు, తండ్రి మోహన్ బాబుకు మధ్య గొడవలు వచ్చేందుకు కారణం వినయ్ అని పదే పదే ఒక వ్యక్తి పేరు వార్తల్లో వినిపిస్తోంది. అయితే వాస్తవానికి ఆయన పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ప్రస్తుతం ఆయన మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇంతకీ అసలు ఈయన ఎవరు అంటే..?
ప్రముఖ హిందీ మీడియా గ్రూప్ దైనిక్ భాస్కర్ లో వినయ్ గతంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈయన సారథ్యంలో ఆ సంస్థ పత్రిక సర్క్యులేషన్ భారీగా పెరిగి మంచి ఆదాయం వచ్చింది. దీంతో వినయ్ పాపులర్ అయ్యారు. తరువాత సాక్షి మీడియాలో చేరారు. అయితే సాక్షిలో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. పైగా ఆయన పొగరుగా వ్యవహరిస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఆయనను తొలగించారు. దీంతో ఆయన 20222లో సాక్షి నుంచి బయటకు వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీ, కాలేజీలు, స్కూళ్ల విషయాలు, ఆర్థిక వ్యవహారాలను చూడడం మొదలు పెట్టారు.
అయితే మోహన్ బాబు దగ్గర పనిచేస్తున్న వినయ్ మంచు విష్ణుకు బాగా క్లోజ్ అయ్యారని టాక్. మోహన్ బాబు ఆస్తిలో మనోజ్‌కు వాటా దక్కకుండా చేయడం కోసం వినయ్, విష్ణు ఇద్దరూ కలసి పనిచేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే మనోజ్ ను వారు దూరం పెడుతూ వస్తున్నారని, అందుకనే మనోజ్ తరచూ తండ్రితో గొడవ పడుతున్నాడని తెలుస్తోంది. ఇక మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదట. దీన్ని అదనుగా తీసుకున్న వినయ్.. మనోజ్‌ను ఆ ఫ్యామిలీకి మరింత దూరం చేశాడని, అందుకనే ఆవేదనతో మనోజ్ తన తండ్రికి ఈ మధ్య వచ్చి గొడవ పడ్డాడని తెలుస్తోంది. అయితే ఈ గొడవలు సద్దుమణుగుతాయా లేదా అనేది వేచి చూస్తే తెలుస్తుంది.