వినోదం

Chandramohan : చంద్ర‌మోహ‌న్ ఫ్యామిలీ సినిమాల‌లోకి ఎందుకు రాలేదో తెలుసా..?

Chandramohan : టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లో చంద్ర‌మోహ‌న్ ఒకరు. మొద‌ట్లో ఆయ‌న హీరోగా అనేక సినిమాలు చేసి త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఎంతో మంది హీరోయిన్స్‌కి లైఫ్ ఇచ్చిన చంద్ర‌మోహ‌న్ కెరీర్‌లో మాత్రం పెద్ద‌గా ఎద‌గ‌లేక‌పోయారు. చంద్ర‌మోహ‌న్ రంగుల‌రాట్నం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత 175 సినిమాల‌లో ఆయ‌న హీరోగా న‌టించాడు. అంతే కాకుండా చంద్రమోహ‌న్ 900ల‌కు పైగా చిత్రాల‌లో న‌టించి మెప్పించారు. అయితే అన్ని చిత్రాల‌లో న‌టించిన చంద్ర‌మోహ‌న్ త‌న ఇద్ద‌రు కూతుళ్లు మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఈ విష‌యం పై చంద్ర‌మోహ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రమోహన్ తనకి ఉన్న ప‌లుకుబ‌డితో తమ పిల్లలను కూడా స్టార్లను చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ చంద్రమోహన్ తన ఫ్యామిలీని సినిమాలకు దూరంగా ఉంచారు.’నా ఇద్దరు కుమార్తెలు.. బాగుంటారని, ఒకానొక సమయంలో భానుమతి గారు చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరినీ చైల్డ్ ఆర్టిస్టులుగా చేద్దామని కూడా ఆమె అడిగారు, కానీ నేను వద్దన్నాను. నటుడిగా బిజీగా ఉన్న రోజుల్లో నాకు పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదు. అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా లోకేషన్ కు వచ్చినా వాళ్లు నన్ను గుర్తు పట్టే వాళ్లు కాదు. ఒక‌సారి సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ షూటింగ్ ఎప్పుడు అడుగు అని అడుగుతారని భయం వేసేదని చెప్పుకొచ్చారు.

why chandra mohan not allowed his daughters to come into movies

త‌న పిల్లల‌పై సినిమా ప్రభావం వాళ్ళపై పడకుండా ఇద్దరిని పెంచారు. వారు బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ‌ట్టు తెలుస్తుంది. చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సప్తపది’ మూవీలో నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక చంద్రమోహన్ తమ్ముడి కూతురు పేరు సబిత కాగా, ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు క్యూ కట్టాయి.

Admin

Recent Posts