Sobhan Babu : ఫిల్మ్ ఇండస్ట్రీలో వారత్వానికి కొదవే లేదు. హీరో హీరోయిన్ల పిల్లలు, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ రంగ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సగంమంది హీరోలు ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇక తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. శోభన్ బాబు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా.. డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారు శోభన్ బాబు.
ఎక్కడ మొదలు పెట్టాలో…ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ టాప్ హీరోగా రాణించారు. అయితే ఇంత స్టార్ డమ్ ఉన్న కూడా మిగితా హీరోల మాదిరి తన కొడుకున మాత్రం ఆయన సినిమాలకు పరిచయం చేయలేదు. ఎప్పుడు ఇండస్ట్రీకీ దూరంగానే ఉంచాడు. అయితే ఆయన అలా ఎందుకు చేసాడో చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది.
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర పాల్గొన ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి మాట్లాడాడు. నేను ఓసారి ఆయనతో.. సార్ మీ కొడుకును హీరో చేయరా అని ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం ఇస్తూ.. హీరోగా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో.. అంత టెన్షన్ పెడుతున్నాను కూడా..! కాబట్టి ఈ టెన్షన్స్ అన్నీ నా కొడుకుకు అవసరం లేదు అని నాకు అనిపించింది. అందుకే వాడిని ఇండస్ట్రీకీ దూరంగా ఉంచాను అని శోభన్ బాబు చెప్పాడు అంటూ రాజా రవీంద్ర పేర్కొన్నారు.