Sobhan Babu Son : సినిమా పరిశ్రమలో వారసుల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు హీరో,హీరోయిన్స్ , దర్శక నిర్మాతల పిల్లలు ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. కొందరు టాప్ హీరోలు మాత్రం తమ పిల్లలని ఇండస్ట్రీ వైపుకి తీసుకు రాలేదు. వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. శోభన్ బాబుకి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ లో ఈయన ఏర్పర్చుకున్న స్థానాన్ని ఇప్పటి ఎవ్వరు అందుకోలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు..శోభన్ బాబు గారు సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి చాలా కష్టాలు పడ్డాడు.
ఆరంభం లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన తర్వాత మాత్రం స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన చనిపోయి 17 ఏళ్ళు దాటుతున్నా కూడా నేటి తరం ప్రేక్షకులు ఇంకా ఆయనని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ..శోభన్ బాబు గారిని అందరూ అప్పట్లో ముద్దుగా సోగ్గాడు అని పిలుచుకునే వారు. అయితే ఆయన కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అప్పుడు అందరు అనుకున్నారు కాని శోభన బాబు సినిమా ఇండస్ట్రీలో పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకొని రిస్క్ తో కూడిన ఇండస్ట్రీ లో దింపి కుమారుడిని కష్టాలపాలు చేయలేదు..వాడికి దేనిమీద ఆసక్తి ఉందొ నాకు బాగా తెలుసు..అందుకే వాడికి నచ్చిన దారిలో వెళ్లే స్వేచ్చని కల్పించాను..ఈరోజు వాడు గొప్ప స్థాయిలో కొనసాగుతున్నాడు అని అప్పట్లో శోభన్ బాబు గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడట.
శోభన్ బాబు కొడుకు, ఆయన కుటుంబం వ్యాపార రంగం లో ఉన్నత స్థాయిలో స్థిరపడి ప్రస్తుతం సంతోషం గా ఉన్నారు..కానీ శోభన్ బాబు గారి అభిమానులకు మాత్రం తమ అభిమాన హీరో లెగసీ శోభన్ బాబు తోనే ముగిసిపోయింది అనే అసంతృప్తి మాత్రం ఉంది. శోభన్ బాబుకి నలుగురి పిల్లలు ఉండగా, వారికి మంచి చదువు ఇచ్చారు. తన తెలివితో ఎక్కువ భూమిని కొంటూ తన కొడుకులకు కావాల్సినంత ఆస్తిని ఇచ్చారు. శోభన్ బాబుకి ముగ్గురు ఆడపిల్లలు, ఒకరు అబ్బాయి.నలుగురిని సినిమాలకు దూరంగానే ఉంచారు.