వ్యాయామం

వ్యాయామం చేస్తున్నారా..? అయితే ఆహారం స‌రిగ్గా తింటున్నారా.. లేదా చెక్ చేసుకోండి..!

ప్రతి ఒక్కరికి వారి గుండెను ఆరోగ్యకరంగా వుంచుకోవాలని వుంటుంది. అయితే దానికవసరమైన వ్యాయామంతో పాటు సరి అయిన ఆహారాన్ని కూడా తీసుకుంటున్నామా లేదా అనేది గమనించాల్సి వుంటుంది. గుండె జబ్బులు రాకుడదని ప్రతి ఒక్కరూ సాధారణంగా తమ ఊబకాయాల్ని తగ్గించుకోడానికి చూస్తారు. అయితే దీనితోపాటు తగిన పోషక విలువలు కల ఆహారాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం వుంది. సరి అయిన పోషణ లేకుండా కేలరీలు ఖర్చు చేసినందువలన ప్రయోజనం లేదు. కనుక గుండె జబ్బులు రాకుండా పోషక విలువలు కల ఆహారం సరి అయిన సమయంలో తీసుకునేందుకు కొన్ని సూచనలిస్తున్నాం.

చాలామంది తక్కువగా తింటూ అధిక వర్కవుట్లు చేస్తే బరువు తగ్గిపోతామనుకుంటారు. కాని ఇది సరికాదు. మనం కనుక 4 లేదా 5 గంటలపాటు ఏమీ తినకుండా వుంటే శరీరం వెంటనే అలారం బటన్ నొక్కేస్తుంది. దీనిని మనం ఆకలి పుట్టేస్తోందని భావిస్తాం. మీరు డైట్ లో వుంటారు కాని మీ శరీరం అందుకంగీకరించదు. శరీరం తన లోపలి కొవ్వులు ఎనర్జీ కొరకు ఖర్చు చేయకుండా, కండరాలనుండి ప్రొటీన్లను తీసుకుని కొవ్వులను అత్యవసరం కొరకు వుంచేస్తుంది. ఈ ఆకలి పుట్టించిన సమయంలో వెంటనే మీరు తినేస్తే, తిన్న ఆహారమంతా నేరుగా కొవ్వుగా మారటం జరుగుతుంది. కనుక మీరు ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిపాటి ఆహారం మాత్రమే తీసుకుంటుండాలి.

are you doing exercise then check whether you are taking correct food

ఆహారం అంటే ఆఫీస్ కేంటీన్లో లభించే భోజనంగా భావించకండి. ఆహారమంటే యాపిల్ లాంటి ఒక పండుకావచ్చు లేదా ఒక మిల్క్ షేక్ కావచ్చు. మనలో చాలామంది కడుపు నిండా తింటే గాని పని చేయలేమని లేకుంటే శక్తి క్షీణించి బలహీనమవుతామని భావిస్తారు. సాధారణ ఆరోగ్యం వున్న వ్యక్తి విషయంలో ఇది నిజం కాదు. ఏవైనా వ్యాయామాలు చేయాలంటే ఉదయంపూట కడుపు ఖాళీగా వున్నపుడే చేయాలి. మీరు గనుక బలహీనం అయి లేదా రక్తపోటు తగ్గితే అపుడు ఒక చిన్న మొత్తంలో ప్రొటీనులు అధికంగాను కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోండి.

ఎగ్ వైట్ లేదా మొలకెత్తిన గింజలు ఇందుకు గాను సూచించదగినవి. మధ్యాహ్నం పూట పూర్తిగా భోజనం చేసి వర్కవుట్లు మొదలెడితే ప్రయోజనం చేకూరదు. చాలామంది హడావుడిగా జిమ్ లకు వెళ్ళి వర్కవుట్లు చేస్తుంటారు. సరిగా వీటిని చేయకపోతే సమయం వృధా చేసినట్లే. సాధారణంగా మరో తప్పు అందరూ చేసేది. బాగా అలసిన వ్యాయామం చేసిన తర్వాత వెంటనే ఎంతో కొంత ఆహారాన్ని తినేస్తారు. వర్కవుట్లు చేసిన గంట తర్వాత తినాలి. లేకుంటే ఆ ఆహారం మీరు కోల్పోయిన ఎనర్జీకి ఖర్చుపెట్టబడుతుంది.

Admin

Recent Posts