వ్యాయామం

ఈ వ్యాయామాల‌ను ఇంట్లోనే చేయ‌వ‌చ్చు.. సిక్స్ ప్యాక్ బాడీ వ‌స్తుంది..!

శరీర వ్యాయామాలకు ప్రాధాన్యతలనిచ్చే నేటి యువత తమ పొట్ట భాగం సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ గా వుండాలని తీవ్ర కృషి చేస్తున్నారు. దానికొరకు జిమ్ లలో చేరటం, వివిధ పోషక పదార్ధాలు కల తిండ్లు తినటం కూడా చేస్తున్నారు. బలంగా వుండే పొట్ట కండరాలు వెన్నెముకకు కూడా బలాన్నిస్తాయి. జిమ్ లకు వెళ్ళకుండా ఇంటివద్దే చేసుకోదగిన కొన్ని పొట్ట వ్యాయామాలు పరిశీలిద్దాం. 1. వెల్లకిలా నేలపై పడుకోండి. తల వెనుక చేతులు పెట్టి మో చేయి మోకాలికి తగిలిస్తూ ఎడమ, కుడివైపులు పొట్టను వంగేలా టచ్ చేయండి. నేలపైభాగం నుండి తలను కొద్దిగా లేపి గాలిలోకి కాళ్ళను పైకి లేపుతూ సైకిలులా తొక్కండి. ఈ వ్యాయామాన్ని 15 నుండి 20 నిమిషాలు చేయండి.

2. తిన్నగా నిలబడండి. పొట్ట వంగేటట్టుమోకాళ్ళపై కూర్చుని చేతులు తిన్నగా ముందుకు చాచండి. ఈ సిటింగ్ పొజిషన్ 1 నుండి 2 నిమిషాలు చేయండి. పొట్ట కొవ్వు తగ్గటానికి ఈ పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది.

do this exercise in home for six pack body

3. ఒక చాపపై పడుకోండి. ఛాతీ భాగాన్ని ముందుకు లేపండి. చేతులు మెడవెనుక పెట్టండి. మోకాళ్ళను నేలనుండి 4 లేదా 5 అంగుళాలు పైకి ఎత్తండి. ఈ పొజిషన్ 2 లేదా 3 నిమిషాలు చేయండి. పైన చెప్పిన వ్యాయామాలు ఒక్కొక్కటి 15 నుండి 20 సార్లు ప్రతి దినం చేయండి. వ్యాయామానికి తగిన పోషక విలువలు కల ఆహారం తీసుకోండి. మీరు కోరే శారీరక ధారుఢ్యం పొందండి.

Admin

Recent Posts