మారిన జీవన పరిస్థితులు,ఆహారపుటలవాట్లు,కాలుష్యం ఫలితంగా ఊబకాయం..అది తగ్గించుకోవడానికి వర్కవుట్లు..పార్కుల్లో పాట్లు,వాకింగ్ లు,రన్నింగ్ లు..ఎన్ని చేసినా ఫలితం శూన్యం..బరువు తగ్గడానికి,ఆరోగ్యంగా ,ఫిట్ గా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రిజల్ట్ కనపడట్లే అంటే మనకు తెలియకుండానే ఏదో పొరపాట్లు చేస్తున్నట్టు అర్దం..జిమ్ లలో గంటలు గంటలు గడిపినా ఒంట్లో కొవ్వు మాత్రం కరగట్లేదంటే వర్కౌట్స్ చేసేప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారేమో గమనించండి.
ఏ పని అయినా ఎక్కువగా చేస్తే త్వరగా అలసిపోతాం.వ్యాయామం కూడా అంతే ప్రతి రోజు వ్యాయామం చేస్తేనే ఫలితం ఉంటుంది అనుకుంటే పొరపాటు.కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా ఉంటే బాడీకి రెస్ట్ ఇచ్చినవారమవుతాం.దీంతో తరవాతి వారం అంతా చాలా రిలాక్స్ ఎక్సర్ సైజ్ చేసుకోవడానికి మన బాడీ రెడీ గా ఉంటుంది. తక్కువ కేలోరిలు ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం.అంతమాత్రం చేత కొందరు పూర్తిగా కొవ్వు పదార్ధాలను దూరం పెట్టేస్తారు.మోతాదుకి మించి తీసుకుంటే నష్టం కానీ..మోతాదుగా ప్రోటీన్లు,కొవ్వు పదార్దాలు,కార్బొహైడ్రేట్స్ అనేవి శరీరానికి చాలా ముఖ్యం. ఎక్కువగా వ్యాయామం చేస్తే త్వరగా రిజల్ట్ ఉంటుంది అనుకోవడం పొరపాటు.మనం చేసే వ్యాయామం మన శరీరానికి సరోపతుందా లేదా చూసుకోవాలి.అతి అనర్దదాయకం అని తెలుసు.ఎక్సరైసైజ్ కూడా అంతే ..
ఎనర్జీ డ్రింక్స్ మీ శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి..ముఖ్యంగా వ్యాయామం చేస్తున్నప్పుడు,లేదంటే వ్యాయామం అయిపోయాక ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకండి.ఈ డ్రింక్స్ ఖనిజాలతో పాటు పెద్ద మొత్తంలో చక్కెర కలిగి ఉంటాయి..వాటి వలన శరీరానికి ఉపయోగం కంటే నష్టం ఎక్కువ. కొంతమంది వ్యాయామం చేసేప్పుడు మంచినీరు తాగడానికి ఇష్టపడరు.పూర్తిగా వాటర్ ని అవాయిడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు.ఎందుకంటే ఎక్సర్ సైజ్ చేసేప్పుడు చెమట ద్వారా మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది..అలాంటప్పుడు బాడీకి సరిపడా వాటర్ తీసుకోవడం మంచిది. మనం చేస్తున్న ఎక్సర్ సైజ్ కి మనం తీసుకుంటున్న ఆహారానికి సంభందం ఉండేలా చూసుకోవాలి.ఈ రోజు ఎక్కువగా వర్కౌట్స్ చేశా కదా అని ఎక్కువ ఆహారం తీసుకోవడం ఇలాంటి పద్దతులు కరెక్ట్ కాదు.మనం తీసుకునే ఆహారం గురించి మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి.
ఖాలీ కడుపుతో లేదంటే ఫుల్ గా తినేసి ఎప్పుడు జిమ్ కి వెళ్లకండి..జిమ్ కి వెళ్లడానికి కనీసం రెండు గంటల ముందు ఏదన్నా తినేలా ప్లాన్ చేసుకోండి. ఎక్సర్ సైజ్ చేసిన వెంటనే స్నానం చేయడం కరెక్ట్ కాదు.ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు ,ఆ తర్వాత మన బాడీ నుండి చాలా ద్రవాలు బయటకు పోయి ఉంటాయి.అలాంటప్పుడు ఆ ప్లూయిడ్స్ ని ఫుల్ ఫిల్ చేయకుండా ఆవిరి పట్టి స్నానం చేసినట్టయితే అనారోగ్యమే కాదు కొన్ని సార్లు మూర్చ వచ్చి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది.కాబట్టి వ్యాయామం కంప్లీట్ అయ్యాక వాటర్ తాగి ఆ తర్వాత స్నానం చేయడం సరైన పద్దతి. ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత కాళ్లు చేతులను చాచి కాసేపు అలాగే ఉంచాలి.ఈ విధంగా చేయడం వలన అప్పటి వరకు వ్యాయామం చేసి పట్టేసినట్టుగా ఉన్న కండరాలు వదులవుతాయి,తర్వాతి రోజు ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవకుండా ఉండేలా తోడ్పడతాయి.