చాలామంది వాకింగ్ చేయండి బాగుంటుందని చెప్తూ ఉంటారు. అయితే, అసలు వాకింగ్ చేయడం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చు..? మీకు తెలుసా..? ఇవి కనుక చూసారంటే కచ్చితంగా వాకింగ్ చేయడం మొదలు పెడతారు. వాకింగ్ చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. రోజూ వాకింగ్ చేయడం వలన పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్య నిపుణులు కూడా వాకింగ్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
రోజూ వాకింగ్ చేయడం వలన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు వాకింగ్ చేయడం వలన బీపీ లెవెల్స్ తగ్గుతాయి. బీపీ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడానికి వాకింగ్ సహాయపడుతుంది. పైగా వాకింగ్ చేయడం వలన బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఎంతసేపు వాకింగ్ చేయాలనే విషయానికి వచ్చేస్తే.. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతిరోజు 45 నిమిషాలకు వాకింగ్ చేయడం మంచిదట.
ఇలా చేయడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుందట. అలాగే నీరసం వంటి సమస్యలు కూడా వాకింగ్ తో నయమవుతాయట. అయితే, ఎంతసేపు వాకింగ్ చేయాలి అన్నది మీ వయసు బట్టి ఉంటుంది. 35 ఏళ్ల వ్యక్తి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు నడిస్తే మంచిది. అదే 75 ఏళ్ల వాళ్లయితే రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది.