Walking For Weight Loss : మనలో చాలా మంది రోజూ వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మనం సులభంగా చేసయదగిన వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒకటి. ఈ వ్యాయామాన్ని ఎవరైనా చేయవచ్చు. అలాగే దీనిని చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. రోజులో అరగంట సమయాన్ని కేటాయిస్తే చాలు. రోజూ వాకింగ్ చేయడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. వాకింగ్ చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తూఉంటారు. రోజూ వాకింగ్ చేయడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజూ పదివేల అడుగులు నడవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. 12,000 మందిపై జరిపినపరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వాకింగ్ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. వాకింగ్ చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆలోచనా విధానం మారుతుంది. వాకింగ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల షుగర్, బీపీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణం మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన జీవితకాలం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలిగినప్పటికి దీనిని ఎలా పడితే అలా చేయకూడదు. వాకింగ్ నెమ్మదిగా చేసిన చురుకుగా చేసిన ఒక నిర్దిష్టమైన వేగం ఉండేలా చూసుకోవాలి. శరీరం డీహ్రైడేషన్ కు గురి కాకుండా చూసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవాలి. వాకింగ్ మధ్యలో విరామం తీసుకునే ప్రయత్నం చేయాలి. విరామం తీసుకునేటప్పుడు వెంటనే వాకింగ్ చయడం మానేయకుండా ముందుగా 3 నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. విరామం తీసుకున్న తరువాత మరలా వెంటనే వేగంగా వాకింగ్ చేయకుండా నెమ్మదిగా వేగాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా వాకింగ్ చేయడంవల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.