Ghee With Pepper : నెయ్యి, మిరియాల పొడిని క‌లిపి రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు పొంద‌వ‌చ్చు..!

Ghee With Pepper : నెయ్యిని పురాత‌న కాలం నుంచి భార‌తీయులు త‌మ నిత్య కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తున్నారు. చాలా మంది నెయ్యితో తీపి వంట‌కాలు చేసుకుంటారు. త‌ల్లులు త‌మ చిన్నారుల‌కు రోజూ నెయ్యిని పెడుతుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అంద‌జేస్తుంది. దీన్ని మిరియాల పొడితో క‌లిపి తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ghee With Pepper on empty stomach amazing health benefits

1. నెయ్యి, మిరియాల పొడిని క‌లిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. వాపుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఈ మిశ్ర‌మం ఎంత‌గానో ప‌నిచేస్తుంది. ఈ మిశ్ర‌మం వ‌ల్ల గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

2. నెయ్యి, మిరియాల పొడి మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె, లివ‌ర్‌ల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది.

3. నెయ్యి, మిరియాల పొడి మిశ్ర‌మం మెద‌డును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి.

4. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఆ శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. క‌రోనా స‌మ‌యం క‌నుక ఇన్‌ఫెక్ష‌న్ రాకుండా నివారించ‌వ‌చ్చు. అలాగే సీజ‌న‌ల్ గా వ‌చ్చే వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

5. ద‌గ్గు, జ‌లుబు ఉన్న‌వారు నెయ్యిలో మిరియాల పొడి క‌లిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే ఎంతో ఫ‌లితం ఉంటుంది. ఆ స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

6. నెయ్యిలో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది.

7. అధికంగా మందుల‌ను వాడ‌డం, కాలుష్యం, రోజూ సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం కార‌ణంగా మ‌న శ‌రీర డీఎన్ఏ దెబ్బ తింటుంది. కానీ నెయ్యి, మిరియాల పొడి మిశ్ర‌మాన్ని వాడ‌డం వ‌ల్ల డీఎన్ఏ దెబ్బ తిన‌కుండా చూసుకోవ‌చ్చు. లేదంటే వ్యాధులు వ‌స్తాయి.

8. నెయ్యి, మిరియాల పొడి మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల యాంజియో జెనెసిస్ అనే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. అంటే కొత్త‌గా ర‌క్త నాళాలు త‌యార‌వుతాయ‌న్న‌మాట‌. దీంతో శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. వాపులు త‌గ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.

9. నెయ్యి, మిరియాల పొడి మిశ్ర‌మాన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఒక టీస్పూన్ నెయ్యిలో అర టీస్పూన్ మిరియాల పొడిని క‌లిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. ద‌గ్గు, జలుబు ఉన్న‌వారు త‌గ్గే వ‌ర‌కు ఈ మిశ్ర‌మాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవ‌చ్చు. త‌రువాత యథావిధిగా రోజూ కేవ‌లం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. దీంతో పైన తెలిపిన లాభాలు క‌లుగుతాయి.

Editor

Recent Posts