సాధారణంగా ఎవరైనా సరే ఉదయాన్నే స్నానం చేస్తుంటారు. ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేవారు ఉదయాన్నే స్నానం చేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చాక ముఖం, కాళ్లు, చేతులను కడుక్కుంటారు. కానీ స్నానం చేయరు. అయితే సాయంత్రం స్నానం చేయకపోయినా.. రాత్రి నిద్రించే ముందు స్నానం చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
* రాత్రి స్నానం చేయడం వల్ల రోజంతా శరీరంపై చేరిన బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. అవి మనపై దాడి చేయవు. ఫలితంగా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
* హైబీపీ సమస్య ఉన్నవారు రాత్రి నిద్రించే ముందు స్నానం చేస్తే మంచిది. దీంతో బీపీ తగ్గుతుంది. రాత్రి పూట హార్ట్ ఎటాక్ లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
* నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి నిద్రకు ముందు స్నానం చేస్తే నిద్ర చక్కగా పడుతుంది.
* ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఉన్నవారు రాత్రి నిద్రించే ముందు స్నానం చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హాయిగా నిద్రించవచ్చు.
* రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా నిద్ర లేస్తారు. ఉదయం నుంచే చురుగ్గా ఉంటారు. బద్దకం, సోమరితనం తగ్గుతాయి.