Garlic Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది రోజూ వాడే వంటి ఇంటి పదార్థాల్లో ఒకటిగా మారింది. వెల్లుల్లిని చాలా మంది రక రకాల కూరల్లో వేస్తుంటారు. వెల్లుల్లితో వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. వీటితో పచ్చళ్లను కూడా పెట్టుకుంటారు. నాన్ వెజ్ వంటకాల్లో అయితే వెల్లుల్లి ముఖ్య పాత్రను పోషిస్తుంది. అయితే వెల్లుల్లితో తయారు చేసే నీటిని రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెల్లుల్లి రెబ్బలను 3, 4 తీసుకుని బాగా దంచాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే ఒక కప్పు మోతాదులో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం టీ లాగా తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి కనుక ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు.
2. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ వెల్లుల్లి నీటిని తాగితే ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
3. వెల్లుల్లి నీటిని రోజూ తాగడం వల్ల శరరీంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిన వారు రోజూ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు.
5. వెల్లుల్లి నీటిని తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రం సరిగ్గా వస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది.