మన శరీరంలోని గ్రంథులు ఉత్పత్తి చేసే రసాయనాలనే హార్మోన్లు అంటారు. ఇవి మన శరీరంలో అనేక క్రియలు సరిగ్గా నిర్వహించబడేలా చూస్తాయి. తినాలనే కోరిక నుంచి నిద్రించాలని అనిపించే వరకు హార్మోన్లు మన శరీరంలో అనేక విధులు నిర్వర్తిస్తాయి. మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే అందుకు హార్మోన్లు కూడా అవసరం అవుతాయి. అయితే కొన్ని రకాల హార్మోన్లు మన మూడ్‌ను కూడా నియంత్రిస్తాయి. అంటే మనల్ని పలు విధాలుగా అనుభూతి చెందేలా చేస్తాయి. ఈ క్రమంలోనే ఆ హార్మోన్లలో సంతోషాన్ని కలిగించే, పాజిటివ్‌గా ఆలోచించేలా చేసే హార్మోన్లు కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానం పాటించడం వంటివి చేస్తే ఆ హ్యాప్పీ హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సంతోషంగా ఉంటారు.
దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ మెదడుతో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే మనం సంతోషంగా ఉంటాం. శరీరంలో ఈ హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసుకోవాలి. అందుకు గాను నిత్యం వ్యాయామం చేయాలి. తగినన్ని గంటల పాటు నిద్రించాలి. వేళకు నిద్రపోవాలి. రోజూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. దీంతో శరీరంలో డోపమైన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారి సంతోషంగా ఉంటాం.
ఇది సహజసిద్ధమైన యాంటీ డిప్రెస్సెంట్‌లా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఆధారపడి పనిచేస్తుంది. మనం తినే ఆహారాల వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీంతోపాటు వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే పాల వంటి ఆహారాలను రాత్రి పూట తీసుకోవాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే నెయ్యి, నట్స్, పప్పు దినుసులు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో సెరొటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. మానసిక సమస్యలు తగ్గుతాయి.
దీన్నే లవ్ హార్మోన్ అంటారు. ఇది మనుషుల మధ్య చక్కని సంబంధాలను నెలకొల్పేందుకు సహాయపడుతుంది. అలాగే భావోగ్వేగాలతో సంబంధాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అనుబంధం ఏర్పడాలంటే వారిలో ఈ హార్మోన్ ఉత్పత్తి కావాలి. ఇందుకు రోజూ యోగా చేయడం లేదా ఆత్మీయులతో కొంత సేపు సరదాగా గడపడం.. వంటివి చేయాలి. దీంతో ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
శరీరం ఎదుర్కొనే ఒత్తిడి, నొప్పులను తగ్గించేందుకు ఎండార్ఫిన్స్ పనిచేస్తాయి. ఈ హార్మోన్ మనకు ప్రశాంతతను అందిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. రోజూ బాగా నవ్వడం, ఇష్టమైన ఆహారం తినడం, ధ్యానం చేయడం, మసాజ్ చేసుకోవడం.. వంటివి చేస్తే ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.