అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుత తరుణంలో చాలా మందికి శక్తికి మించిన భారం అవుతోంది. అనేక కారణాల వల్ల చాలా మంది బరువు అయితే పెరుగుతున్నారు. కానీ అధిక బరువును తగ్గించుకోవడం కష్టంగా మారుతోంది. అయినప్పటికీ కొందరు నిత్యం బరువును తగ్గించుకోవడం కోసం శ్రమిస్తూనే ఉన్నారు. అయితే ఆరోగ్యకరమైన పద్ధతిలో వారానికి ఎన్ని కిలోల వరకు బరువును తగ్గించుకోవచ్చు ? వారానికి 1 కిలో వరకు బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా ? ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారు ? అంటే..
వారంలో 1 కిలో బరువు తగ్గడం అనేది శ్రేయస్కరమే. దాని వల్ల ఎలాంటి దుష్పరిణామాలు రావు. అయితే ఇది అందరికీ వర్తించదు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. అందువల్ల కొందరు తక్కువ సమయంలోనే త్వరగా బరువు తగ్గుతారు. కొందరు బరువు తగ్గేందుకు ఎక్కువ రోజుల సమయం తీసుకుంటారు. అయితే వారంలో 1 కిలో వరకు బరువు తగ్గడం అనేది అందరికీ మంచిది కాదు. కానీ ఎవరైనా సరే వారంలో అరకిలో వరకు బరువును తగ్గవచ్చు. అది ఆరోగ్యకరమే. దాని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
వారంలో 1 కిలో బరువు తగ్గాలని చూసే వారు విపరీతమైన వ్యాయామం చేస్తుంటారు. నిత్యం చాలా తక్కువ క్యాలరీలు లభించేలా ఆహారం తీసుకుంటారు. అయితే ఇలా తీవ్రంగా వ్యాయామం చేయడం హానికరం. కనుక ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి. కాకపోతే వ్యాయామం చేయడం వల్ల కొందరు ఎలాగూ ఆటోమేటిగ్గా బరువు వేగంగా తగ్గుతారు. కనుక అది ఆరోగ్యకరమే అని చెప్పవచ్చు. అందువల్ల ఈ విషయాన్ని ఎవరికి వారు నిర్దారించుకోవాలి. అయితే ఎవరికైనా సరే.. వారంలో అరకిలో బరువు తగ్గడం అన్నది శ్రేయస్కరమే. వైద్య నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365