గ్లూటెన్ అంటే ఏమిటి ? ఇది ఎందులో ఉంటుంది ? గ‌్లూటెన్ ఉన్న ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దా ?

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు ఎక్క‌డ చూసినా గ్లూటెన్ అనే మాట బాగా వినిపిస్తోంది. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌.. గ్లూటెన్ లేని ఆహారం అంటూ కంపెనీలు త‌మ ఆహార ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తున్నాయి. అయితే ఇంత‌కీ అస‌లు గ్లూటెన్ (Gluten) అంటే ఏమిటి ? ఇది ఎందులో ఉంటుంది ? ఇది ఉన్న ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఏవైనా దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయా ? అనారోగ్యం పాలు అవుతామా ? అంటే..

what is gluten in telugu

గోధుమ‌లు, రై, బార్లీ వంటి ధాన్యాల్లో గ్లూటెన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ జాతికి చెందిన ప‌దార్థం. ఇందులో మ‌ళ్లీ రెండు ప్రోటీన్లు ఉంటాయి. వాటిని glutenin (గ్లుటెనిన్), gliadin (గ్లియాడిన్‌) అని పిలుస్తారు. అయితే గ్లూటెన్ లో ఉండే గ్లియాడిన్ అనేది మ‌న‌కు దుష్ప‌రిణామాల‌ను క‌లిగిస్తుంది. మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది. అందుక‌నే గ్లూటెన్ అనేది లేకుండా ఆహారాల‌ను త‌యారు చేసి కంపెనీలు మ‌న‌కు అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని కంపెనీల ఉత్ప‌త్తుల ప్యాకింగ్‌పై మ‌నం గ్లూటెన్ ఫ్రీ అని ముద్రించి ఉండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

అయితే నిజానికి గ్లూటెన్ ఉండ‌డం వ‌ల్ల పిండి నీటితో క‌లిసిన‌ప్పుడు సాగుతుంది. ఎల‌స్టిక్‌లా మారుతుంది. ఈ క్ర‌మంలోనే ఆ పిండితో చపాతీలు, ప‌రోటాలు ఇత‌ర ప‌దార్థాల‌ను సుల‌భంగా చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఇక గ్లూటెన్ ఉన్న పిండిని వాడితేనే బేక‌రీ ప‌దార్థాలు స‌రిగ్గా త‌యార‌వుతాయి. అయితే గ్లూటెన్ ఉన్న ఆహారాల‌ను తిన‌కూడ‌ద‌నే ఒక వాద‌న ఉంది.

గ్లూటెన్ ఉన్న ఆహారాల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని ప‌లువురు వైద్య నిపుణులు చెబుతుంటారు. దీని వ‌ల్ల గ్యాస్, అసిడిటీ, డ‌యేరియా, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు నొప్పి, త‌ల‌నొప్పి, అల‌స‌ట‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు, డిప్రెష‌న్, స‌డెన్ గా అధిక బరువు త‌గ్గ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని చెబుతారు. కానీ కొంద‌రు మాత్రం అలాంటేదేమీ లేద‌ని, గ్లూటెన్ ఉన్న ప‌దార్థాల‌ను తిన‌వ‌చ్చ‌ని అంటుంటారు. అయితే పైన తెలిపిన ధాన్యాల‌కు చెందిన ఆహార ప‌దార్థాల‌ను తింటే కింద ఇచ్చిన స‌మ‌స్య‌లు గ‌న‌క వ‌స్తే అలాంటి వారు గ్లూటెన్ ఉన్న ప‌దార్థాల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఆయా ల‌క్ష‌ణాల‌ను చూసి దాన్ని బ‌ట్టి గ్లూటెన్ ఉన్న ప‌దార్థాల‌ను తినాలా, వ‌ద్దా.. అనే విష‌యాన్ని ఎవ‌రికి వారు నిర్దారించుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపించక‌పోతే ఈ విష‌యం ప‌ట్ల అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts