Categories: Featured

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఎలా చేయాలి ? ఏమేం లాభాలు క‌లుగుతాయి ?

సాధార‌ణంగా కొంద‌రు భ‌క్తులు వారంలో ఒక రోజు త‌మ ఇష్ట దైవం కోసం ఉప‌వాసం ఉంటుంటారు. కొంద‌రు ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ఉప‌వాసం చేస్తుంటారు. ఇక ముస్లింలు అయితే రంజాన్ సంద‌ర్భంగా ఉప‌వాసం ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ఉప‌వాసం చేస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇంత‌కీ అస‌లు ఈ ఉప‌వాసం ఏమిటి ? దీన్ని ఎలా పాటించాలి ? దీని వల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అంటే…

what is intermittent fasting benefits in telugu

Intermittent Fasting అంటే.. రోజులో చాలా గంట‌ల పాటు ఏమీ తిన‌కుండా కేవ‌లం నీరు మాత్ర‌మే తాగుతూ ఉండి.. కేవ‌లం కొన్ని గంట‌ల పాటు మాత్ర‌మే మ‌న‌కు ఇష్టం వచ్చినంత తినాల‌న్న‌మాట‌. అంటే..

రోజుకు 24 గంట‌లు క‌దా.. Intermittent Fasting లో 14 నుంచి 16 గంట‌లు ఉప‌వాసం ఉంటారు. ఆ స‌మ‌యంలో కేవ‌లం నీరు, ఇత‌ర ద్ర‌వాహారాలు త‌ప్ప ఏమీ తాగ‌రు, తిన‌రు. మిగిలిన 8 – 10 గంట‌ల స‌మ‌యంలో త‌మ‌కు నచ్చిన ఆహారాన్ని ఇష్టం వ‌చ్చినంత తింటారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. ఉద‌యం 8 గంట‌ల‌కు బ్రేక్‌ఫాస్ట్ చేశార‌నుకుందాం. 16 గంట‌ల Intermittent Fasting తీసుకుంటే కేవ‌లం 8 గంట‌ల పాటు మాత్ర‌మే భోజ‌నం చేయాలి క‌దా. క‌నుక ఉద‌యం 8 గంట‌ల‌కు బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తే.. అప్ప‌టి నుంచి 8 గంట‌లు.. అంటే.. సాయంత్రం 4 గంట‌ల‌కు భోజ‌నం ముగించాలి. ఇక ఆ త‌రువాత ఏమీ తీసుకోకూడ‌దు. మ‌రుస‌టి రోజు ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు అలాగే ఉండాలి. ఆహారం తీసుకోరాదు. దీంతో 16 గంట‌ల ఉప‌వాసం అవుతుంది. ఇలా Intermittent Fasting చేయాల్సి ఉంటుంది.

Intermittent Fasting స‌మ‌యంలో ద్ర‌వాహారం అంటే నీరు తాగ‌వ‌చ్చు. చ‌క్కెర లేకుండా కాఫీ, టీ, పండ్ల ర‌సాలు తీసుకోవ‌చ్చు. కానీ అవి కూడా త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ విధంగా Intermittent Fasting పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే…

* Intermittent Fasting లో శ‌రీరానికి చాలా సేపు విరామం ల‌భిస్తుంది. దీంతో అనేక వ్య‌వ‌స్థ‌ల‌కు అది మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

* డ‌యాబెటిస్ ఉన్న‌వారు వైద్యుల స‌ల‌హా మేర‌కు ఈ ఫాస్టింగ్ చేస్తే డ‌యాబెటిస్ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది. ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

* అధిక బ‌రువు త‌గ్గుతారు.

* కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

* జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.

అయితే Intermittent Fasting ను 14 నుంచి 18 గంట‌ల వ‌ర‌కు కూడా చేయ‌వ‌చ్చు. కానీ ముందే అతిగా చేయ‌డం కంటే నెమ్మ‌దిగా ప్రాక్టీస్ చేస్తే త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ ఫ‌లితం పొంద‌వచ్చు. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వైద్యుల సూచ‌న మేర‌కు ఈ ఫాస్టింగ్ చేస్తే మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts