food

Arikela Kichdi : అరికెల‌తో ఎంతో రుచిగా ఉండే కిచిడీ.. ఇలా చేయండి..!

Arikela Kichdi : చిరుధాన్యాల‌లో ఒక‌టైన అరికెల‌తో మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అరికెల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే అరికెల‌ను తినేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కార‌ణం ఇవి అంత‌గా రుచిగా ఉండ‌వు. కానీ వీటితో కిచిడీ త‌యారు చేసి తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, మ‌న‌కు పోష‌కాల‌ను సైతం అందిస్తుంది. దీన్ని మ‌నం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోనూ తిన‌వ‌చ్చు. అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే అరికెల కిచిడీ త‌యారీకి ఏమేం ప‌దార్థాలు కావాలో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరికెల కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అరికెలు – అర‌క‌ప్పు, పెస‌ర ప‌ప్ప – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠానీ – అర క‌ప్పు, ఉల్లిపాయ – 1, ట‌మాటా – 1, అల్లం త‌రుగు – 1 టీస్పూన్‌, ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు రెబ్బ‌లు – 2, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, కారం – 1 టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, ప‌సుపు – కొద్దిగా.

do you know how to make kichdi with arikelu

అరికెల కిచిడీ త‌యారీ విధానం..

అరికెలు, పెస‌ర ప‌ప్పును ఓ గిన్నెలో తీసుకుని గంట సేపు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద కుక్క‌ర్‌ని పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. అది వేడ‌య్యాక జీల‌క‌ర్రం, అల్లం, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఇంగువ‌, ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా త‌రుగు, ప‌చ్చి బ‌ఠానీ వేసి బాగా క‌లిపి, కారం, త‌గినంత ఉప్పు, రెండు క‌ప్పుల నీళ్లు పోసి అరికెలు, పెస‌ర ప‌ప్పు వేసి మూత పెట్టి, ఒక విజ‌ల్ వ‌చ్చే వ‌ర‌కు ఉంచి దింపేయాలి. త‌రువాత కిచిడీని బాగా క‌లిపి వ‌డ్డించే ముందు మిగిలిన నెయ్యి వేస్తే స‌రిపోతుంది. ఇలా క్ష‌ణాల్లోనే ఎంతో రుచిక‌ర‌మైన అరికెల కిచిడీ త‌యారు చేయ‌వ‌చ్చు. అరికెల‌తో ఏం చేయాలా.. అని ఆలోచించే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఒక వైపు రుచిని ఆస్వాదిస్తూనే మ‌రోవైపు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin