food

ఎంతో రుచికరమైన ఫింగర్‌ ఫిష్‌ను ఇలా తయారు చేసుకోండి..!

చేపలతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోచ్చు. ఏ వంటకం చేసినా చేపలు అంటే ఇష్టపడే వారు వాటిని బాగానే తింటారు. ఇక చేపలతో ఫింగర్‌ ఫిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫింగర్‌ ఫిష్‌ తయారీకి కావల్సిన పదార్థాలు

చేపలు – అర కేజీ, బ్రెడ్‌ ముక్కలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీస్పూన్లు, కారం – కొద్దిగా, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – టీస్పూన్‌ (వేయించాలి), గుడ్లు – రెండు, ఉప్పు – రుచికి తగినంత.

fish fingers recipe make like this

తయారు చేసే విధానం

ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా, నిలువుగా ముక్కలు కోయాలి. గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను పొడి చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోని చేప ముక్కలు తీసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. గంటయ్యాక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక చేప ముక్కలను గుడ్డు సొనలతో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే వేడి వేడి ఫింగర్‌ ఫిష్‌ సిద్ధమవుతుంది.

Admin

Recent Posts