Poha Aloo Cutlet : అటుకులు, ఆలుతో ఇలా 10 నిమిషాల్లో క‌ట్‌లెట్లు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Poha Aloo Cutlet : అటుకుల‌తో కూడా మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో పోహ ఆలూ క‌ట్లెట్ కూడా ఒక‌టి. అటుకులు, బంగాళాదుంప‌లు క‌లిపి చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా సుల‌భంగా అలాగే చాలా త‌క్కువ నూనెతో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం ఒకే ఒక టేబుల్ స్పూన్ నూనెతో ఈ క‌ట్లెట్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా, త‌క్కువ నూనెతో పోహ ఆలూ క‌ట్లెట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పోహ ఆలూ కట్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అటుకులు – ఒక‌టిన్న‌ర క‌ప్పులు, ఉడికించిన బంగాళాదంప‌లు – 2, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, వేయించిన జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్.

Poha Aloo Cutlet make them in simple way
Poha Aloo Cutlet

పోహ ఆలూ క‌ట్లెట్ త‌యారీ విధానం..

ముందుగా అటుకుల‌ను శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అర క‌ప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని చేత్తో వ‌త్తుతూ మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను తురిమి తీసుకోవాలి. త‌రువాత అల్లం, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లిని క‌చ్చా ప‌చ్చాగా దంచి వేసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు చేతుల‌కు నూనె రాసుకుంటూ అటుకుల మిశ్ర‌మాన్ని తీసుకుని క‌ట్లెట్ లాగా వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వీటిని 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిజ్ లో ఉంచి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత క‌ట్లెట్ ల‌ను వేసి కాల్చుకోవాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పోహ‌జ ఆలూ క‌ట్లెట్ త‌యార‌వుతుంది. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన క‌ట్లెట్ ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts