మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో శుభవార్త చెప్పింది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వృద్ధులతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.
45 ఏళ్లకు పైబడిన వయస్సు ఉన్నవారికి కూడా వ్యాక్సిన్‌ను ఇస్తామని మంత్రి తెలిపారు. దేశంలో మొత్తం 10వేల ప్రభుత్వ, 20వేల ప్రైవేటు సెంటర్లలో టీకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని అన్నారు. ప్రైవేటు సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని అనుకునేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ధరలను మరో 3, 4 రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారు.