ప్రముఖ భారతీయ ఆయుర్వేద కంపెనీ డాబర్ మార్కెట్‌లోకి కొత్త ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసింది. అను తైలం పేరిట విడుదలైన ఈ ఔషధం తలనొప్పి, ముక్కు దిబ్బడ నుంచి తక్షణమే ఉశమనం అందిస్తుందని డాబర్ వెల్లడించింది. ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తమ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నట్లు డాబర్ తెలియజేసింది.
ఈ సందర్భంగా డాబర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ డాక్డర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ పురాతన ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయలలో అను తైలం ప్రస్తావన ఉందన్నారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అను తైలం అద్భుతమైన ఔషధ విలువలను కలిగి ఉంటుందని తెలిపారు. ఇది తల భాగంలోని అవయవాలకు కలిగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుందని తెలిపారు.
తమ కంపెనీ తయారు చేసిన అను తైలం తలనొప్పి, ముక్క దిబ్బడ నుంచి తక్షణమే ఉపశమనం అందిస్తుందని అన్నారు. ఆధునిక పద్ధతుల్లో ఈ మందును తయారు చేశామని తెలిపారు. దీన్ని వాడడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుందని, ముక్కు, చెవి, కళ్లు, నాలుక విధులను మెరుగు పరుస్తుందని తెలిపారు.
డాబర్‌కు చెందిన అను తైలం నాసల్ డ్రాప్స్ 10 ఎంఎల్ ప్యాక్ ధర రూ.70గా ఉంది. దేశంలోని అన్ని రిటెయిల్ స్టోర్స్‌తోపాటు ఇ-కామర్స్ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లలోనూ దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఔషధం వల్ల తలనొప్పి, జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు తగ్గుతాయని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఎన్నో సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఈ మందును తయారు చేశామన్నారు. దీన్ని రోజూ ఉదయాన్నే 2 చుక్కల మోతాదులో ప్రతి నాసికా రంధ్రంలోనూ వేసుకోవాలని సూచించారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365