ఇటీవల మార్కెట్‌లో ప్రతీది కల్తీ జరుగుతుంది. చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు. రీసెంట్‌గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో మనం ఉపయోగిస్తున్న దాదాపు 53 రకాల మాత్రలు ఈ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించకపోవడం గమనార్హం.పారాసిటమాల్- 500 ఎమ్‌జీ, పాన్-డీ, కాల్షియం సప్లిమెంట్లు వంటి పలు ఔషధాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు అధికారులు గుర్తించారు.ఈ ఔషధాల్లోనూ నాణ్యతా లోపాలు కూడా బయటపడటంతో మరింత అప్రమత్త, తనిఖీలు అవసరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.కర్నాటక యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేసిన పారాసిటమాల్‌లో కూడా క్వాలిటీ సంబంధిత సమస్యలు ఉన్నట్టు బయటపడింది.
పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది వేసుకునే పారాసెట్‌మాల్ కూడా నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడం ఆందోళనకు కలిగిస్తోంది. కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటిస్ ట్యాబ్లెట్లు సహా మొత్తం 53 మాత్రలు ఈ క్వాలిటీ టెస్ట్‌లో అర్హత సాధించలేదని సీడీఎస్‌సీఓ స్పష్టం చేసింది. అయితే పారసిటమాల్ కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా మనం ఏమి వాడవచ్చు అనేది ఇంటెన్సివ్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ మినేష్ మెహతా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ముందుగా ఇబుప్రోఫెన్.. పారాసెటమాల్ మాదిరిగానే, ఇబుప్రోఫెన్ నొప్పికి చికిత్స గా పని చేస్తుంది. జ్వరంకి కూడా ఉపయోగించవచ్చు. నిమెసులైడ్ కూడా పారాసెటమాల్ మాదిరిగా ప్రభావంతంగా పని చేస్తుంది. డిక్లోఫెనాక్ అనేది పారాసెటమాల్ కంటే ప్రభావవంతంగా పని చేస్తుంది..
వంటగదిలో ఉండే వాటితో కూడా నివారణ చేసుకోవచ్చు. నీరు, హెర్బల్ టీలు మరియు సూప్‌లు వంటి ద్రవాలను పుష్కలంగా తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు గొంతు నొప్పి తగ్గుతుంది. ఆవిరి పట్టడం వలన దగ్గు తగ్గే ఛాన్స్ ఉంటుంది, ముక్కు బ్లాక్ అయిన రిలీఫ్ వస్తుంది. ఇక జ్వరం వచ్చినప్పుడు నుదుటిన, మెడ దగ్గర తడి గుడ్డ వేసుకుంటే ఉపశమనం ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది. గోరువెచ్చని స్నానం చేయడం వల్ల జ్వరాన్ని మెల్లగా తగ్గించుకోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం వలన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పాలలో పసుపు కలుపుకొని తాగడం వలన జలుబు మరియు శరీర నొప్పుల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.