కరోనా నేపథ్యంలో అనేక కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో గతేడాది బి.1.617 అనే వేరియెంట్‌ను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ ప్రస్తుతం 44 దేశాల్లో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్లడించింది. ఈ వేరియెంట్ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది.
మే 11వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 దేశాల నుంచి 4500 శాంపిళ్లను సేకరించి పరిశీలించారు. దీంతో సదరు వేరియెంట్ ఆ శాంపిల్స్‌లో ఉన్నట్లు గుర్తించారు. అయితే బి.1.617 వేరియెంట్ ప్రస్తుతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, అందువల్ల దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని WHO అభిప్రాయ పడింది.
బి.1.617 వేరియెంట్ అనేక రకాలుగా మార్పులు చెందినది. అందువల్ల వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందువల్లే అనేక దేశాల్లో ఈ వేరియెంట్ పంజా విసురుతోంది. అయితే ఈ వేరియెంట్‌ను మొదటి సారిగా భారత్‌లో అక్టోబర్ 2020లో గుర్తించారు. కానీ ప్రస్తుతం ఈ వేరియెంట్ మన దగ్గర కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.
భారత్ లో ప్రస్తుతం రోజూ 40వేలకు పైగా కోవిడ్ కేసు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి కోవిడ్ మూడో వేవ్ వస్తుందని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్రాలు ఇప్పటికే చర్యలను ప్రారంభించాయి. అయితే ఈ స్ట్రెయిన్ వల్ల మూడో వేవ్‌లో ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అంటున్నారు.