గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 47,092 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,89,583కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వివరాలను వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 509 మంది కోవిడ్ వల్ల చనిపోగా మొత్తం మరనాల సంఖ్య 4,39,529 కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంక్య 1.19 శాతం ఉండగా, రికవరీ రేటు 97.48 శాతానికి చేరుకుంది. గడిచిన 48 గంటలతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య 11,402 పెరిగాయి.
వారాంతపు పాజిటివిటీ రేటు 2.62 శాతంగా నమోదైంది. గత 69 రోజులుగా ఇది 3 శాతం కన్నా తక్కువగా ఉంటోంది.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,20,28,825 కి చేరుకుంది. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. బుధవారం ఒక్క రోజే 81.09 లక్షల కోవిడ్ టీకాలు వేశారు. దీంతో మొత్తం 66.30 కోట్ల టీకాలను వేశారు.
కాగా భారత్‌లో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య గతేడాది ఆగస్టు 7 వరకు 20 లక్షల మార్కుకు చేరుకోగా ఆగస్టు 23 వరకు 30 లక్షలు, సెప్టెంబర్ 5 వరకు 40 లక్షలు, సెప్టెంబర్ 16 వరకు 50 లక్షలకు చేరుకుంది.
గతేడాది సెప్టెంబర్ 28 వరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 60 లక్షల మార్కు దాటగా, అక్టోబర్ 11 వరకు 70 లక్షలు, అక్టోబర్ 29 వరకు 80 లక్షలు, నవంబర్ 20 వరకు 90 లక్షలు, డిసెంబర్ 19 వరకు 1 కోటి మార్కుకు చేరుకున్నాయి. ఈ ఏడాది మే 4 వరకు 2 కోట్లు, జూన్ 23 వరకు 3 కోట్ల మార్కును దాటాయి.
కాగా గడిచిన 24 గంటల్లో సంభవించిన 509 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 183 చోటు చేసుకోగా, కేరళలో 173 మరణాలు సంభవించాయి.