10 Foods For Diabetes : మారిన జీవన విధానం కారణంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. రోజు రోజుకి షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పవచ్చు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు వారు తీసుకునే ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి మేలు చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధితో బాధపడే వారు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇన్సులిన్ సెన్సెటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మునగాకును తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే దీనిలో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మునగాకును తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవి తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఈ ధాన్యాన్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
ఆపిల్, బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇవి తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా నెమ్మదిగా పెరుగుతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ చక్కెర స్థాయిలను పెంచకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇక చిక్కుళ్లు, కాయధాన్యాలు, బీన్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. అలగే శరీరానికి బలం కూడా కలుగుతుంది. వీటితో పాటు షుగర్ వ్యాధి గ్రస్తులు కాకరకాయను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీనిలో విటమిన్ ఎ, సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
కాకరకాయ రసం లేదా కాకరకాయలను కూరగా చేసి తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సెటివిటీ పెరుగుతుంది. ఇక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉసిరికాయ కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగాఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సెటివిటీ మెరుగుపడుతుంది. ఉసిరికాయ రసం లేదా పొడిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్ సెన్సెటివిటీని మెరుగుపరచడంలో పసుపు కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. వంటలతో పాటు పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో మెంతులు కూడా మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి లేదా వంటల్లో వాడడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు శరీరానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.