Pepper Idli Fry : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటిని ఇలా చేసి తింటే సూప‌ర్‌గా ఉంటాయి..!

Pepper Idli Fry : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి. సాంబార్, చ‌ట్నీతో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కం ఇడ్లీలు కాకుండా ఈ ఇడ్లీల‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పెప్ప‌ర్ ఇడ్లీ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ విధంగా త‌యారు చేసిన ఇడ్లీల‌ను ఇష్టంగా తింటారు. మిగిలిన ఇడ్లీల‌తో కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగాపెప్ప‌ర్ ఇడ్లీ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెప్ప‌ర్ ఇడ్లీ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – అర టీ స్పూన్, అల్లం త‌రుగు – అర టీ స్పూన్, బ‌ట‌న్ ఇడ్లీ – 15 నుండి 20, ఉప్పు – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Pepper Idli Fry recipe tasty snacks to make
Pepper Idli Fry

పెప్ప‌ర్ ఇడ్లీ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు, అల్లం త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ఇడ్లీలు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, మిరియాల పొడి వేసి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. చివ‌ర‌గా నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెప్ప‌ర్ ఇడ్లీ ఫ్రై త‌యార‌వుతుంది. చిన్న ఇడ్లీల‌తోనే కాకుండా పెద్ద ఇడ్లీల‌ను ముక్క‌లుగా చేసి కూడా ఈ ఇడ్లీ ఫ్రై త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా తయారు చేసిన ఇడ్లీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చ‌ట్నీలేక‌పోయినా కూడా ఈ ఇడ్లీల‌ను నేరుగా అలాగే తిన‌వ‌చ్చు.

D

Recent Posts