10 Fruits For Weight Loss : మనం రోజూ ఆహారంలో భాగంగా అనేక రకాలుగా పండ్లను తీసుకుంటూ ఉంటాము. పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వైద్యులు కూడా పండ్లను ఆహారంగా తీసుకోమని చెబుతూ ఉంటారు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఇలా అనేక రకాలుగా పండ్లు మనకు సహాయపడతాయి. వీటితో పాటు పండ్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా.. అవును పండ్లను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. పండ్లల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోకి అదనంగా క్యాలరీలు వెళ్లకుండా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఏయే పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు ఆపిల్ పండ్లను తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిలో ఉండే ఫాలీఫినాల్స్ ఊబకాయానికి వ్యతిరేకంగా పని చేస్తాయి. ఆపిల్ ముక్కలను నేరుగా తినలేని వారు వీటిపై దాల్చిన చెక్క పొడిని చల్లుకుని తీసుకోవచ్చు. అలాగే అరటిపండ్లను తీసుకోవడం వల్ల కూడా మం బరువు తగ్గవచ్చు. అరటిపండులో 105 క్యాలరీల శక్తి, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలాసమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే నారింజ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గవచ్చు. వీటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నారింజ పండ్లల్లో ఉండే నోబిలెటిన్ అనే రసాయన సమ్మేళనం స్థూలకాయానికి వ్యతిరేకంగా పని చేస్తుంది. రోజూ ఒక గ్లాస్ నారింజ పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గవచ్చు. అలాగే నీటి శాతం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాల్లో పుచ్చకాయలు కూడా ఒకటి. శరీర బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. పుచ్చకాయలను ముక్కలుగా లేదా జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గవచ్చు. అదే విధంగా బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, సి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఊబకాయాన్ని తగ్గించడంలో బొప్పాయి పండ్లు ఎంతో దోహదపడతాయి. వీటిని ముక్కలుగా చేసి తీసుకోవడం వల్ల లేదా స్మూతీలల్లో చేర్చుకుని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.
అలాగే క్యాలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అదే విధంగా రోజూ ఒక గ్లాస్ పైనాఫిల్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. పైనాఫిల్ ను తీసుకోవడం వల్ల శరీరానికి క్యాలరీలు తక్కువగా అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక జామపండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు జామపండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఒక్క జామపండును తీసుకోవడం వల్ల 37 నుండి 55 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఇతర ఆహారాల జోలికి మనం వెళ్లకుండా ఉంటాము. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారు పచ్చికొబ్బరిని తీసుకోవాలి. పచ్చికొబ్బరిని తీసుకోవడం వల్ల మనం త్వరగా బరువు తగ్గవచ్చు. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు కలిగిన ఆహారాల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. వీటిలో నీటి శాతంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. దానిమ్మగింజలను తీసుకోవడం వల్ల లేదా జ్యూస్ రూపంలో చేసి తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనం సులభంగా, వేగంగా బరువు తగ్గవచ్చు.