7 Days Diet Plan : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే సమస్యల్లో ఇది ఒకటి. అధిక బరువు సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీనిని నిర్లక్ష్యం చేసే మనం అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. అన్నం తినడం మానేస్తూ ఉంటారు. అయినప్పటికి చాలా మంది బరువు తగ్గడం లేదు. మనం తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరుగుతామని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది కొద్ది సేపు పని చేసిన తరువాత విశ్రాంతి తీసుకుని పని చేస్తూ ఉంటారు. ఇలా పని చేయడం వల్ల బరువు ఏ మాత్రం తగ్గరని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా చాలా మంది అనేక ప్రయత్నాలు చేసి బరువు తగ్గుతారు. బరువు తగ్గాము కదా ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. దీంతో మరలా బరువు పెరుగుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా బరువు తగ్గే అవకాశం తగ్గడం వల్ల ఎన్ని రకాల డైటింగ్ పద్దతులను పాటించినప్పటికి బరువు తగ్గరని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చక్కటి ఆహార నియమాలను పాటించాలి.
అలాగే తీసుకునే ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నూనెను చాలా తక్కువగా ఉపయోగించాలి. ఉప్పును కూడా తీసుకోవడం తగ్గించాలి. చాలా మంది బరువు తగ్గాలని అన్నాన్ని మానేసి చపాతీలను తీసుకుంటూ ఉంటారు. మనం నీటిని తప్ప ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా మన శరీరానికి క్యాలరీలు అందుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో చూసుకుని తీసుకోవాలి. చపాతీలకు బదులుగా పచ్చి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, కీరదోస, టమాట వంటి వాటిని తీసుకోవాలి.
నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. పెరగడం, తగ్గడం వంటివి చేయకూడదు. బరువు ఎక్కువగా ఉన్న వారు ఏ ఆహారం తీసుకున్నా కూడా అది ఎక్కువగా కొవ్వుగా తయారవుతుంది. కనుక క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా సాయంత్రం 6 నుండి 7 గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.