Jaggery : మనం తీపి పదార్థాల తయారీలో పంచదారతోపాటు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. బెల్లం ఒక సహజమైన తియ్యటి పదార్థం. దీనికి సహజమైన తియ్యటి గుణం ఉంటుంది. ఇందులో ఉండే సహజ తియ్యదనం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఎన్నో ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. పంచదార కంటే బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠం. ఎందుకంటే ఇందులో ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా బెల్లాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
బెల్లం మన శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. బెల్లాన్ని రోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ బెల్లాన్ని తినడం వల్ల కాలేయంలో ఉండే వ్యర్థాలు తొలగిపోవడంతో పాటు కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది. బెల్లంలో ఉండే పోషకాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడి శరీరాన్ని ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేస్తాయి. బెల్లాన్ని ఇంటి వైద్యంలో కూడా ఉపయోగించవచ్చు. పొడి దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బెల్లం, తులసి ఆకులు వేసి కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
నీటిలో బెల్లాన్ని వేసి కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. పెరుగులో బెల్లం వేసి కలిపి తీసుకోవడం వల్ల జలుబు, కఫం తొలగిపోతాయి. బెల్లం, నెయ్యిని సమపాళ్లల్లో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. కడుపులో మంటతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా బెల్లం తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకు శరీర దృఢత్వం కోసం బెల్లం, జొన్నలు కలిపిన మిశ్రమాన్ని ఇస్తే మంచిది. బెల్లంతో చేసిన పప్పు ఉండలు తినడం వల్ల శరీరానికి పుష్టి కలుగుతుంది. రక్తవృద్ధి జరుగుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
బెల్లంలో ఉండే సోడియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రోజూ భోజనం తరువాత చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లల్లో బెల్లం ముక్కను వేసి కలిపి తీసుకోవడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రక్తహీనత సమస్య దూరం అవుతుంది. జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. బెల్లంలో ఉండే పోషకాలు జుట్టును కాంతివంతంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులను కూడా దూరం చేసుకోవచ్చు.
పంచదార లాగా బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచదు. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు పంచదారకు బదులుగా ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కనుక అందరూ బెల్లం ముక్కను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.