Carom Seeds : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంటి ఇంటి దినుసుల్లో వాము ఒకటి. వీటిని అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వాము వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలను తగ్గించడంలో వాము ఎంతగానో సహాయపడుతుంది. ఒక టీస్పూన్ వాము గింజలను అర చేతిలో వేసి బాగా నలపాలి. అనంతరం అందులో కాస్త ఉప్పు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని తినేయాలి. అనంతరం గోరు వెచ్చని నీళ్లను ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. ఇలా చేస్తుంటే ఎలాంటి కడుపు నొప్పి అయినా సరే తగ్గిపోతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి అద్భుతమైన గుణాలు వాములో ఉంటాయి. కనుకనే దీనికి ఆయుర్వేదంలోనూ ప్రాధాన్యతను కల్పించారు.
ఇక వాము గింజల వల్ల మనకు ఒక ముఖ్యమైన ఉపయోగం కలుగుతుంది. అదేమిటంటే.. వాము గింజలను దంచి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తాగాలి. దీని వల్ల ఊపిరితిత్తులకు గాలి వెళ్లే మార్గం మొత్తం శుభ్రమవుతుంది. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. కనుక శ్వాస సమస్యలు ఉన్నవారు వాము గింజలను ఇలా వాడితే మేలు జరుగుతుంది.
ఇక వాముతో ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దీన్ని కాస్త వేయించి పొడి చేసి ఉప్పు కలపాలి. దాన్ని అన్నంలో మొదటి ముద్దగా తినాలి. దీని వల్ల అజీర్తి సమస్య బాధించదు. గ్యాస్ కూడా ఏర్పడదు. అలాగే వాము, జీలకర్ర, ధనియాలను సమాన భాగాల్లో తీసుకుని కాస్త వేయించాలి. వాటిని వేసి కషాయం మరిగించాలి. దాన్ని 30 ఎంఎల్ మోతాదులో రోజుకు మూడు సార్లు తాగాలి. దీంతో జ్వరం తగ్గుతుంది.
ఒక టీస్పూన్ వాము గింజల పొడిని అంతే మోతాదులో తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తినాలి. దీంతో కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాము గింజలను పొడి చేసి దాన్ని వస్త్రంలో చుట్టి వాసన పీలుస్తుంటే జలుబు తగ్గిపోతుంది. వాము, బెల్లం కలిపి ఉసిరికాయంత సైజ్‌లో ఉండలను చేసి తినాలి. దీంతో ఆస్తమా తగ్గుతుంది. అలాగే వాముతో కషాయం కాచి తాగుతుంటే కఫం మొత్తం కరిగిపోతుంది. వామును బుగ్గన పెట్టుకుని నమిలితే కొండనాలుకకు ఏర్పడే వాపు తగ్గుతుంది. ఇలా వాము మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.