హెల్త్ టిప్స్

Amla Health Benefits : చ‌లికాలంలో రోజూ రెండు ఉసిరి ముక్క‌లు తింటే చాలు.. ఎంతో ప్ర‌యోజ‌నం..!

Amla Health Benefits : ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి వలన అనేక లాభాలు ఉంటాయి. చలికాలంలో, ఉసిరికాయలు మనకి బాగా దొరుకుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉసిరికాయని తీసుకుంటే, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉసిరికాయ రెండు ముక్కలని, ప్రతి రోజు తీసుకోవచ్చు. సీజన్ కానప్పుడు ఎండిన ఉసిరి ని కూడా తీసుకోవచ్చు. ఎండిన ఉసిరిముక్కలు ఆయుర్వేదం షాపుల్లో మనకి ఈజీగా దొరుకుతాయి. కావాలంటే ఆన్లైన్ స్టోర్ లో కూడా తీసుకోవచ్చు. ఎండిన ఉసిరిముక్కలని ఇంట్లోనే మనం ఈజీగా కావాలంటే తయారు చేసుకోవచ్చు.

ఈరోజుల్లో ఆరోగ్యము విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడుతున్నారు. ఉసిరికాయల్ని తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉసిరికాయను తీసుకుంటే, వృద్ధాప్య లక్షణాలని కూడా తగ్గించుకోవచ్చు. ఉసిరికాయ తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉసిరికాయల్ని తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి, ముక్కలు కింద కట్ చేసుకోవచ్చు. బాగా ఎండిన ఈ ముక్కల్ని సంవత్సరం పొడుగునా నిల్వ ఉంచుకుని తీసుకోవచ్చు. ఉసిరికాయ ముక్కల్ని తీసుకుంటే నోటి పొక్కులు సమస్య ఉండదు.

Amla Health Benefits take daily 2 pieces in winter

నోటిపూత వంటి సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. కొలెజెన్ కణజాలాన్ని రక్షించే, వృద్ధాప్య లక్షణాలని ఆలస్యం చేస్తుంది. ఉసిరికాయలులో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. యవ్వనంగా ఉండడానికి కూడా ఉసిరికాయ ఉపయోగపడుతుంది.

ఉసిరికాయ ముక్కల్ని కానీ ఉసిరికాయ పొడిని కానీ తీసుకోవచ్చు. చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది ఉసిరి. ఉసిరి తాజాగా దొరికినప్పుడు, మనం పచ్చడి లేదంటే కషాయం కూడా తీసుకోవచ్చు. ఉసిరితో, ఇలా అనేక సమస్యలు దూరం చేసుకోవచ్చు. అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఉసిరికాయని సంవత్సరం పొడుగునా నిల్వ ఉంచుకుని తీసుకుంటే, ఇన్ని సమస్యలకి దూరంగా ఉండవచ్చు.

Admin

Recent Posts