Antibodies Foods : మన శరీరంలో వైరస్, బ్యాక్టీరియాలను బంధించి మనకు రక్షణ కలిగించడానికి ఉపయోగపడే వ్యవస్థ మన శరీరంలో ఉంది. యాంటీ బాడీస్ ను పీ సెల్స్ తయారు చేస్తూ ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి సిద్దంగా ఉన్న యాంటీ బాడీస్ ఇన్ఫెక్షన్ కలగకుండా, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తాయి. యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయితే రక్షణ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటుంది. మన తీసుకునే ఆహారాల ద్వారా కూడా మనం శరీరంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చు. మన శరీరంలో ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ప్రోబయోటిక్స్ సహాయపడతాయి. ఈ ప్రోబయోటిక్స్ జంతు సంబంధిత ఆహారాల్లో, వృక్ష సంబంధిత ఆహారాల్లోనూ ఉంటాయి.
జంతు సంబంధిత ఆహారాలను తీసుకోవడం వల్ల అలాగే మాగిన పండ్లను తినడం వల్ల ఈ ప్రొబయోటిక్స్ మన శరీరానికి అందుతాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడడంతో పాటు తెల్ల రక్తకణాల ఉత్తేజంగా ఉంచడంలో అవి ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో ఈ విటమిన్ సి సహాయపడుతుంది. యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. జామ కాయలు, కమలా పండ్లు, బత్తాయి కాయలు, ఉసిరి కాయలను తీసుకోవడం వల్ల యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే విటమిన్ డి చాలా అవసరం.
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, విటమిన్ డి క్యాప్సుల్స్ ను తీసుకోవడం వంటివి చేయాలి. శరీరానికి తగినంత విటమిన్ డి లభించడం వల్ల యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే మనకు ఫైబర్ చాలా అవసరం. ఫ్యాటీ యాసిడ్లను బ్రేక్ డౌన్ చేసి రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ ఉపయోగపడుతుంది. కనుక మనం ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే యాంటీ బాడీస్ తయారవ్వాలంటే మన శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం అవుతాయి. పుచ్చ గింజలు, సోయాచిక్కుడు గింజలు, మొలకెత్తిన గింజలు వంటి ఆహారాలను తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బాడీస్ ఎక్కువగా తయారవుతాయి. అలాగే మనం శరీరానికి తగినన్ని యాంటీ ఆక్సిడెంట్లను అందించడం చాలా అవసరం.
విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ వంటివి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. యాంటీ బాడీస్ వైరస్, బ్యాక్టీరియాలను బంధించి నశింపజేసిన తరువాత వ్యర్థాలు విడుదల అవుతాయి. ఈ వ్యర్థాలను యాంటీ ఆక్సిడెంట్లు బయటకు పంపిస్తాయి. ఇలా తయారైన వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళితేనే మన శరీరంలో రక్షణ వ్యవస్థ చురుకుగా ఉంటుంది. కనుక యాంటీ ఆక్సిడెంట్లు కూడా మన శరీరానికి చాలా అవసరం. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల సహజ సిద్దంగానే మనం శరీరంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చు. తద్వారా మనం ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు.