హెల్త్ టిప్స్

Proteins : మీ శ‌రీరానికి ప్రోటీన్లు స‌రిగ్గా అందుతున్నాయా..? లేదంటే జాగ్ర‌త్త‌..!

Proteins : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే, మనకి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎముకలుని దృఢంగా మారుస్తుంది ప్రోటీన్. శరీరంలో ప్రోటీన్ కనుక లేకపోతే, అనేక సమస్యలు వస్తాయి. ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే, ఉబకాయం, ఎముకల బలహీనత మొదలు జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఇలా పలు సమస్యలు కలుగుతాయి. కానీ. శరీరానికి వివిధ వయసులో వివిధ రకాల ప్రోటీన్స్ కావాలి. వాటి గురించి ఇప్పుడే మనం చూద్దాం.

ప్రోటీన్ ఆకలికి కారణమయ్యే హార్మోన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. లెప్టిన్ స్థాయిలని పెంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువుని కంట్రోల్ చేస్తుంది. బలమైన కండరాలకి, ఎముకలకి ప్రోటీన్ కావాలి. శరీరంలో కొత్త ఎముకలు ఏర్పడడానికి ప్రోటీన్ అవసరం. బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల ప్రమాదం నుండి కూడా, ప్రోటీన్ మనల్ని రక్షిస్తుంది. ప్రోటీన్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.

are you getting enough proteins or what

అలానే, క్యాలరీలను కరిగించేందుకు కూడా, ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ తీసుకుంటే, బరువు తగ్గడానికి కూడా అవుతుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా, అతిగా తినడాన్ని కూడా ఇది నిరోధిస్తుంది. శరీరంలో గోళ్లు, జుట్టు, చర్మం, కండరాలు, ఎముకలు అంతర్గత అవయవాలు ఏర్పడడానికి ప్రోటీన్ చాలా అవసరం.

కణాలు, కణజాలాలని ప్రోటీన్స్ సృష్టిస్తుంది. ప్రోటీన్ లేకపోతే ఎముకలు పగుళ్ళకి గురవుతాయి. వయస్సు పెరిగే కొద్దీ ఖండాలు ద్రవ్యరాశి , ఎముకల సాంద్రత, బలం తగ్గిపోతాయి. వృద్ధులకి పెద్దలకంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లోపం నుండి బయటపడడానికి గుడ్లు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చికెన్, సోయా, పాలు, టోఫు, బీన్స్, ఓట్స్ ని కూడా తీసుకుంటే మంచిది. శరీర బరువులో కిలో గ్రాముకు 0.8 నుండి 1 గ్రాము ప్రోటీన్ కావాలి.

Admin

Recent Posts