White Bread : సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో వివిధ రకాల ఆహారాలను తింటుంటారు. ఇక కొందరైతే బ్రెడ్‌తో చేసే ఆహారాలను తింటారు. అయితే వాస్తవానికి ఉదయం పరగడుపున బ్రెడ్ తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పరగడుపున ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లను తీసుకోవాలని.. కానీ బ్రెడ్‌ను తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయని అంటున్నారు. ఇక పరగడుపున బ్రెడ్ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పరగడుపున బ్రేక్ ఫాస్ట్ రూపంలో వైట్ బ్రెడ్‌ను తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వైట్ బ్రెడ్‌లో సులభతరమైన కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. దీని వల్ల ఆకలి త్వరగా అవుతుంది. ఫలితంగా తినాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఆహారాలను తింటాం. ఇది అధిక బరువుకు ఆ తరువాత టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు దారి తీస్తుంది. కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఎట్టి పరిస్థితిలోనూ వైట్ బ్రెడ్‌ను తినరాదు.
వైట్ బ్రెడ్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఇలా ఉదయం బ్రెడ్‌ను తింటే అది టైప్ 2 డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. కనుక ఉదయం బ్రెడ్‌ను తీసుకోకపోవడమే మంచిది. ఇక వైట్ బ్రెడ్ సులభతరమైన కార్బొహైడ్రేట్ల జాబితాకు చెందుతుంది. కనుక జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కనుక తెల్లని బ్రెడ్‌ను అసలు తినరాదు.
వైట్ బ్రెడ్‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి మంచిది కాదు. దీని వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. అలాగే కిడ్నీలపై భారం పడుతుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వైట్ బ్రెడ్‌ను తినేవారు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు.