హెల్త్ టిప్స్

వేస‌వి మొదలైపోయింది.. కీర‌దోస‌ను తిన‌డం మ‌రిచిపోకండి..!

ఎక్కువగా కీరదోసకాయను ఉపయోగించి సలాడ్స్ వంటివి చేసుకుంటూ ఉంటాము. దీంట్లో విటమిన్ సి, వాటర్ కంటెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోస కాయ ఒకటే కాకుండా క్యారెట్, ఆపిల్స్ వంటి వాటితో కలిపి సలాడ్ చేసుకుని తీసుకుంటే రుచిగా ఉంటుంది. కీర దోసని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

కీరదోస కాయను తీసుకోవడం వల్ల కిడ్నీ శుభ్ర పరచడం లో సహాయ పడుతుంది. నిజంగా ఇది ఒక గొప్ప రెమిడీ అని మనం చెప్పవచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లాడర్, కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా సహాయ పడుతుంది. హైబీపీ, లోబీపీ రెండిటినీ కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది.

as summer is started we must take cucumber in this season daily

దీనిలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేడి వాతావరణం లేదా వేసవి కాలంలో శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది, తలనొప్పితో సతమతమయ్యే వారు రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకోవడం వల్ల తల నొప్పి నివారించడానికి బాగా సహాయపడుతుంది. కళ్ళ కింద నల్లని వలయాలు, వాపులు తొలగి పోవాలంటే కీరదోసకాయను చక్రాల్లా కోసుకుని కళ్ళ కింద పెట్టుకుంటే ఇవి తొలగిపోతాయి. దంతాల ఆరోగ్యానికి, చిగుళ్ళ నుంచి రక్తం కారడం సమస్య కలిగితే కీరదోసకాయ రసం చేసుకుని తీసుకుంటే తగ్గిపోతుంది.

Admin

Recent Posts