భోజనం చేసేటప్పుడు లేదా ఇతర సమయాల్లో కొందరు రకరకాల పదార్థాలను కలిపి తింటుంటారు. అయితే కొన్ని పదార్థాలను అలా కలిపి తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. కానీ కొన్ని ఫుడ్ కాంబినేషన్లు మంచివి కావు. అవి మనకు హాని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే ఏయే ఫుడ్ కాంబినేషన్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరినీళ్లు, వాల్‌నట్స్, మాంసం, కోడిగుడ్లు, పెరుగు, ఉలవలు, కందులు, పెసలు, బఠానీలు, పప్పు ధాన్యాలు, కూరగాయలతో పాలను కలిపి తీసుకోకూడదు. తీసుకుంటే జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్‌ల పనితీరు మందగిస్తుంది. దీంతో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది. తిన్న ఆహార పదార్థాలు సరిగ్గా జీర్ణం కాక అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి.
2. ముల్లంగి, వెల్లుల్లి, ఆకుపచ్చని కూరగాయలు, మునగ కాయలు తిన్న తరువాత పాలు తాగకూడదు.
3. భోజనం చేయడానికి ముందు లేదా చేసిన వెంటనే పండ్లను తినరాదు. కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
4. పాలు, పెరుగు, కీరదోస, టమాటాలు వంటి వాటితో నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. తీసుకుంటే అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ సమస్యలు వస్తాయి.
5. చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను ఒకేసారి తినకూడదు. ఒకసారి ఏదైనా మాంసాహారాన్ని తింటే దాన్నే తినాలి. ఇంకో ఆహారాన్ని మరో మాంసాహారంతో కలిపి తినరాదు. అంటే.. చికెన్, మటన్ రెండూ కలిపి ఒకేసారి తినరాదు. అలా తినాల్సి వస్తే 4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
6. మినుములు, తేనె, ముల్లంగి, మొలకెత్తిన గింజలను మాంసాహారంతో కలిపి తినకూడదు. మినుములతో ముల్లంగి, పనస పండ్లను కలిపి తినకూడదు.
7. మజ్జిగ-అరటిపండు, పెరుగు-ఖర్జూరాలు, నల్ల మిరియాలు-చేపలు, పాలు-మద్యం కాంబినేషన్ లో ఆహారాలను తీసుకోకూడదు.
8. నువ్వులు, పాలకూర కలిపి తినకూడదు. ఎందుకంటే ఆ ఆహారాన్ని తింటే డయేరియా వస్తుంది. ఉడికించిన ఆహారాన్ని ఉడకని ఆహారంతో కలిపి తీసుకోకూడదు. లేదంటే ఆ రెండింటితో జీర్ణక్రియ సరిగ్గా జరగక గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365