మన శరీరంలో అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి. వాటిల్లో రోగ నిరోధక వ్యవస్థ ఒకటి. మన శరీరంలోకి చేరే సూక్ష్మ క్రిములను ఎప్పటికప్పుడు గుర్తించి ఈ వ్యవస్థ యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో అవి సూక్ష్మ క్రిములపై దాడి చేసి చంపేస్తాయి. ఈ క్రమంలో మనం ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంటాం. అలా మన రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన శక్తి ఎక్కువగా ఉంటేనే సూక్ష్మ క్రిములను ఎదుర్కొనేందుకు కావల్సినంత శక్తి లభిస్తుంది. కానీ రోగ నిరోధక శక్తి తగ్గితే ఇబ్బందులు వస్తాయి.
అయితే రోగ నిరోధక శక్తి మనకు ఎంత ఉంది ? మనం దృఢంగా ఉన్నామా, లేదా ? అనే విషయాలు మనకు ఎలా తెలుస్తాయి ? రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని ఎలా చెప్పవచ్చు ? అంటే.. అందుకు మన శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించడం ద్వారా మన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మరి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఎంత ఎక్కువగా అంటే దాన్ని భరించలేరు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అంతటి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇలా ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
2. మాటి మాటికీ దగ్గు, జలుబు లేదా జ్వరం వస్తుంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.
3. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. విరేచనాలు అవుతుంటాయి.
4. గాయాలు, పుండ్లు బాగా ఆలస్యంగా మానుతుంటే రోగ నిరోధక శక్తి తగ్గిందని గుర్తించాలి.
5. తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడి వ్యాధులు వస్తున్నా శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువైందని అర్థం చేసుకోవాలి.
6. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అసలు ఏ పనిచేయకపోయినా తీవ్రంగా అలసిపోయినట్లు ఉంటారు. నీరసం బాగా ఉంటుంది.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వారి రోగ నిరోధక శక్తి తగ్గిందని గుర్తించాలి. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దాని వల్ల పైన తెలిపిన లక్షణాలు, సమస్యలు తగ్గుతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365