అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది, కేలరీలు అతి తక్కువ, ఒక మంచి ఆహారంగా కూడా పనిచేసి మీరు సన్నగా నాజూకుగా వుండేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ గింజలేమిటో తెలుసా? అదే బార్లీ గింజలు. తెలుగు వారికి బార్లీ గింజలు కొత్తేమీ కాదు. గతంలో ఇండ్లలో ఒక్కరోజు జ్వరం పడితగ్గితే చాలు బార్లీ జావలు కాచి ఇచ్చేవారు.
అద్భుతమైన ఈ గింజలో నీటిలో కరగని పీచు వుండి శరీరంలో నీటిని నిలిపివుంచుతుంది. పేగులలో వుండే మలినాలను వేగంగా బయటకు పంపేస్తుంది. కేన్సర్ అరికడుతుంది. మలబద్ధకం రాకుండా కూడా బార్లీ జావ తాగుతారు. బార్లీ నీరు కిడ్నీలకు ఒక వరంగా భావించాలి. కీళ్ళనొప్పులు, వంటి నొప్పుల సమస్యలను మాయం చేస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలి?
బార్లీ గింజలను మెత్తగా నీటిలో ఉడికించండి. వడగట్టండి. కొంచెం రుచిగా వుండటానికిగాను వడకట్టిన నీటిలో ఆరెంజ్ జ్యూస్ లేదా నిమ్మరసం కలపండి. అంతే మీ బార్లీ నీరు తయారైనట్లే. దీనిని ఫ్రిజ్ లో లేదా చల్లని ప్రదేశంలో వుంచితే, పోషకాలు పోకుండా వుంటాయి. ఇంత అధ్భుతమైన బార్లీ గింజలను, ప్రతిరోజూ మనం తినే సూప్ సలాడ్, సిరియల్ వంటి వాటిలో కూడా వేసుకొని ప్రయోజనం పొందవచ్చు.