Basmati Rice : బాస్మ‌తి రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Basmati Rice : బాస్మ‌తీ బియ్యం.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటితో ఎక్కువ‌గా పులావ్, బిర్యానీ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బాస్మ‌తీ బియ్యం పొడువుగా, స‌న్న‌గా, చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. బాస్మ‌తీ బియ్యంతో వండిన వంట‌కాలు చ‌క్క‌టి వాస‌న‌తో చాలా రుచిగా ఉంటాయి. మ‌న దేశంలో 29 ర‌కాల బాస్మ‌తీ బియ్యం ఉత్ప‌త్తి జ‌రుగుతుంది. బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తిలో భార‌త దేశ‌మేఅగ్ర‌గామిగా ఉంది. మ‌న దేశంలో పంజాబ్, హిమాచ‌ల్ ప్రదేశ‌, హ‌ర్యానా, ఢిల్లీ, ఉత్త‌రాఖండ్, ఉత్త‌ర ప్ర‌దేశ్, జ‌మ్ముకాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో బాస్మ‌తీ బియ్యాన్ని ఎక్కువ‌గా పండిస్తారు. ఈ బాస్మ‌తీ బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఒక క‌ప్పు బాస్మ‌తి బియ్యంలో 210 క్యాల‌రీల శ‌క్తి, 0.5 కొవ్వులు, 46 గ్రాముల పిండి ప‌దార్థాలు, 0.7 గ్రాముల ఫైబ‌ర్, 5 గ్రాముల ప్రోటీన్, విట‌మిన్ బి1 మ‌రియు బి6, రాగి, ఫోలేట్, ఐర‌న్, మెగ్నీషియం, జింక్ వంటి పోష‌కాలు ఉంటాయి. బాస్మ‌తీ బియ్యంలో కొవ్వు ప‌దార్థాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే ఈ బియ్యంలో గ్లూటెన్ ఉండ‌దు. క‌నుక గ్లూటెన్ ఫ్రీ ఆహారాల‌ను తీసుకునే వారు, కొవ్వు త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకునే వారికి ఇవి చ‌క్క‌టి ఆహారమ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు కూడా బాస్మ‌తి బాయ్యాన్ని త‌గిన మోతాదులో ఆహారంగా తీసుకోవ‌చ్చు. బాస్మ‌తీ బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Basmati Rice health benefits in telugu know about them
Basmati Rice

అధిక ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. బాస్మ‌తి బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు కూడా చాలా తక్కువ‌గా ఉంటాయి. అంతేకాకుండా ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా పని చేస్తుంది. నాడీ సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో కూడా బాస్మ‌తీ బియ్యం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా బాస్మ‌తి బియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని అయితే బాస్మ‌తి బియ్యాన్ని పాలిష్ ప‌ట్ట‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts