Beard And Moustache Grow : గ‌డ్డం, మీసాలు రావ‌ట్లేద‌ని చింతించొద్దు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..!

Beard And Moustache Grow : పురుషుల్లో వ‌య‌సు వ‌చ్చే కొద్ది గ‌డ్డం, మీసాలు వ‌స్తూ ఉంటాయి. వీటిని బ‌ట్టే పురుషులు వ‌య‌సుకు వ‌చ్చార‌ని తెలుసుకుంటూ ఉంటారు. కానీ కొంద‌రిలో 21 నుండి 24 సంవ‌త్స‌రాలు వ‌చ్చిన‌ప్ప‌టికి గ‌డ్డం, మీసాలు రావు. దీంతో పురుషులు చాలా ఇబ్బందికి, ఆందోళ‌న‌కు గురి అవుతూ ఉంటారు. ఇలా గడ్డం, మీసాలు రాక‌పోవ‌డాఇనికి కూడా చాలా కార‌ణాలు ఉంటాయి. గ‌డ్డం, మీసాలు రావ‌డం అనేది కూడా జ‌న్యుప‌రంగా ఆధార‌ప‌డి ఉంటాయి. అలాగే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మీసాలు త్వ‌ర‌గా రావు. సాధార‌ణంగా పురుషుల్లో 250 నుండి 950 నానో గ్రాముల మోతాదులో టెస్టోస్టిరాన్ ఉండాలి. అయితే కొంద‌రిలో ఈ టెస్టోస్టిరాన్ ఉన్న‌ప్ప‌టికి అది గ‌డ్డం, మీసాలు రావ‌డానికి డైహైడ్రో టెస్టోస్టిరాన్ రూపంలోకి మారాలి.

కానీ కొంద‌రిలో ఈ రూపంలోకి టెస్టోస్టిరాన్ మార‌దు. దీంతో గ‌డ్డం, మీసాలు రావు. అలాగే గ‌డ్డం, మీసాలు వ‌చ్చే భాగంలో హెయిర్ ఫోలిక‌ల్స్ సున్నింతంగా ఉండ‌డం వ‌ల్లటెస్టోస్టిరాన్ ఉన్న‌ప్ప‌టికి కూడా గ‌డ్డాలు, మీసాలు రావు. అలాగే అధిక బ‌రువు కార‌ణంగా చాలా మందిలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. ఇలా స‌మ‌స్య‌లు రావ‌డం వ‌ల్ల కూడా చాలా మందిలో మీసాలు, గ‌డ్డం స‌రిగ్గా రావ‌డం లేదు. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా స్త్రీల్ల‌లో ఉండే ఈస్ట్రోజ‌న్ హార్మోన్ పురుషుల్లో ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. దీంతో వారిలో మీసాలు, గ‌డ్డాలు స‌రిగ్గా రావ‌డం లేదు. మీసాలు, గ‌డ్డాలు రావ‌డానికి పురుషులు అనేక రకాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది మందంగా గ‌డ్డాలు, మీసాలు రావ‌డానికి షేవ్ చేసుకుంటూఉంటారు.

Beard And Moustache Grow health tips to follow
Beard And Moustache Grow

కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు. గ‌డ్డాలు, మీసాలు ఎక్కువ‌గా రావాలంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్ప‌త్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. హార్మోన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో మొల‌క‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల హార్మోన్స్ చ‌క్క‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అలాగే సాయంత్రం స‌మ‌యాల్లో డ్రైన‌ట్స్ ఎక్కువ‌గా తీసుకోవాలి. నాన‌బెట్టిన బాదంప‌ప్పు, జీడిప‌ప్పు, వాల్ న‌ట్స్ వంటి వాటిని తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. అలాగే మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఆకుకూర‌ను త‌ప్ప‌కుండాతీసుకోవాలి. ఈ విధంగా డైట్ ను పాటించ‌డం వ‌ల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యి గ‌డ్డాలు, మీసాలు చ‌క్క‌గా వ‌స్తూ ఉంటాయి.

D

Recent Posts